AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhhi Agerwal: కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన ఇస్మార్ట్ బ్యూటీ.. నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్..

ప్రస్తుతం హీరోయిన్ నిధి అగర్వాల్ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

Nidhhi Agerwal: కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన ఇస్మార్ట్ బ్యూటీ.. నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్..
Nidhhi
Rajitha Chanti
|

Updated on: Jan 12, 2022 | 8:59 AM

Share

ప్రస్తుతం హీరోయిన్ నిధి అగర్వాల్ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతకుముందు నిధి నటించిన సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలు అనుకున్నంతగా హిట్ అందుకోలేదు. ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్ సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో యువతను ఆకట్టుకుంది నిధి. ప్రస్తుతం నిధి .. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం హీరో. కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో గల్లా పద్మవతి నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుద కానుంది. ఈ క్రమంలో నిధి అగర్వాల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కాబోయే భర్త ఎలా ఉండాలో ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.

నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. “అబ్బాయిల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో కల ఉంటుంది. నాకు మాత్రం గౌరవించే వ్యక్తులంటే చాలా ఇష్టం. నన్నే కాదు.. చుట్టుప్రక్కల అందరితోనూ గౌరవభావంతో ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మా నాన్నలా ఉండాలి ” అంటూ చెప్పుకొచ్చింది నిధి. అలాగే ఈ ఏడాది తన సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. హీరో, హరి హర వీరమల్లు సినిమా తర్వాత తెలుగులో సినిమాలు ఒప్పుకోలేదని తెలిపింది. ఏప్రిల్ నుంచి హిందీలో ఓ సినిమా చేస్తున్నానని.. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో ఓ సినిమా చేశానంటూ చెప్పుకొచ్చింది నిధి.

అగ్ర తారలతోనే కలిసి నటించాలని ఏం లేదు. మంచి కథలు, తారలతో సినిమాలు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రయాణం చేసుకోవాలి. ముఖ్యంగా మంచి కథలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. అందుకే హీరో స్క్రిప్ట్ వినగానే ఒప్పుకున్నాను. ఇందులో డార్క్ కామెడీ కూడా ఉంటుంది. అలాగే వాణిజ్య సూత్రాలతో కూడుకుని ఉంటుంది. అందుకే కథ వినగానే ఒప్పుకున్నే అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.

Also Read: Hero Siddharth: సైనాపై నేను చేసింది జోక్ మాత్రమే ఆమె గొప్ప క్రీడాకారిణి అంటూ.. బహిరంగంగా క్షమాపణ చెప్పిన హీరో సిద్ధార్ద్..

Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..

Ravi Teja’s Ravanasura: రవితేజ సినిమాకోసం రంగంలో అక్కినేని యంగ్ హీరో.. న్యూ లుక్ మాములుగా లేదుగా..