ఈ స్టార్​ హీరోల తొలి రెమ్యునరేషన్​ ఎంతో తెలుసా..?

బాలీవుడ్ స్టార్​ హీరోస్​ రెమ్యూన‌రేష‌న్ ఎంతుంటుంది..ఊహించ‌డం కూడా క‌ష్ట‌మే. కానీ వారు సినీమాల్లో రాణించ‌క‌ముందు..వాళ్ల జీవనోపాధి కోసం ఫ‌స్ట్ టైమ్ ఎంచుకున్న కెరీర్​ ఏంటి? తొలి జీతం ఎంత తీసుకున్నారు? ఎవరికైనా తెలుసా.. దానికి సంబంధించి కొందరి స్టార్స్ అప్ డేట్స్ ఇప్పుడు చూద్దాం… అమితాబ్​ బచ్చన్ ​కోల్​కతాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజింగ్​ ఎగ్జిక్యూటివ్​గా పనిచేశారు బిగ్ బీ. అప్పుడు ఆయన అందుకున్న తొలి జీతం రూ.500. ప్రస్తుతం అమితాబ్ ఒక రోజుకు ఎంత తీసుకుంటారంటే […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:28 pm, Tue, 5 May 20
ఈ స్టార్​ హీరోల తొలి రెమ్యునరేషన్​ ఎంతో తెలుసా..?

బాలీవుడ్ స్టార్​ హీరోస్​ రెమ్యూన‌రేష‌న్ ఎంతుంటుంది..ఊహించ‌డం కూడా క‌ష్ట‌మే. కానీ వారు సినీమాల్లో రాణించ‌క‌ముందు..వాళ్ల జీవనోపాధి కోసం ఫ‌స్ట్ టైమ్ ఎంచుకున్న కెరీర్​ ఏంటి? తొలి జీతం ఎంత తీసుకున్నారు? ఎవరికైనా తెలుసా.. దానికి సంబంధించి కొందరి స్టార్స్ అప్ డేట్స్ ఇప్పుడు చూద్దాం…

అమితాబ్​ బచ్చన్

​కోల్​కతాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజింగ్​ ఎగ్జిక్యూటివ్​గా పనిచేశారు బిగ్ బీ. అప్పుడు ఆయన అందుకున్న తొలి జీతం రూ.500. ప్రస్తుతం అమితాబ్ ఒక రోజుకు ఎంత తీసుకుంటారంటే కోట్ల‌లోనే ఉంటుంది. కాగా ప్ర‌స్తుతం ‘బటర్​ఫ్లై’, ‘గులాబో సితాబో’, ‘ఝండ్​’, ‘చెహ్రే’, ‘బ్రహ్మస్త్ర’ అనే మూవీస్ లో నటిస్తున్నారు ఈ బాలీవుడ్ మెగాస్టార్.

షారుఖ్​ ఖాన్

​బాలీవుడ్​ బాద్​షా షారుఖ్ ఖాన్​​… సినిమా ఫీల్డ్ కు రాకముందు ఓ గైడ్​గా పనిచేశాడు. అతడు అందుకున్న తొలి జీతం రూ.50. ఈ డ‌బ్బుతో షారుఖ్​ తన ఫ్యామిలీతో ఆగ్రా తాజ్​మహాల్​ చూశాడు. చివరిసారిగా ‘జీరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుక్.

హృతిక్​రోషన్​

బాలీవుడ్​ రొమాంటిక్ హీరో ‘కహోనా ప్యార్​ హే’ మూవీతో హీరో ఎంట్రీ ఇచ్చిన హృతిక్​రోషన్​… చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. అందులో భాగంగా 1980లో వచ్చిన ‘ఆషా’ మూవీలో నటించినందుకు రూ.100 రెమ్యునరేషన్ తీసుకున్నాడు. చివరిసారిగా ‘వార్’​ సినిమాలో నటించాడు హృతిక్​.

అమీర్​ఖాన్

​బాలీవుడ్​ మిస్టర్​ పర్​ఫెక్ట్​ ‘అమీర్​ఖాన్’​ తన తొలి మూవీ ‘క్యామత్​ సే క్యామత్ తక్’​. ఈ మూవీ షూటింగ్ ​ 11నెలల పాటు జరిగింది. ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున జీతం తీసుకున్నాడు. ప్రస్తుతం ‘లాల్​ సింగ్​ చద్ధా’ సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో.