ప్రగతితో మిస్ బిహేవ్ చేసిన స్టార్ కమెడియన్…!
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎన్ని ప్రకంపనలు క్రియేట్ చేసిందో తెలిసిందే. బడా విమెన్ సెలబ్రిటీలు సైతం తమకు ఎదురైన వేధింపులపై గళమెత్తారు. ఈ క్రమంలోనే తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో సంచలన వ్యాఖ్యలు చేసింది తెలుగు నటి ప్రగతి. లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె ఇలా మట్లాడటం ఇండస్ట్రీలో హాట్ ఇష్యూగా మారింది. వందలాది తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్లకు మదర్ గా..సిస్టర్ గా..వదినగా […]

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎన్ని ప్రకంపనలు క్రియేట్ చేసిందో తెలిసిందే. బడా విమెన్ సెలబ్రిటీలు సైతం తమకు ఎదురైన వేధింపులపై గళమెత్తారు. ఈ క్రమంలోనే తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో సంచలన వ్యాఖ్యలు చేసింది తెలుగు నటి ప్రగతి. లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె ఇలా మట్లాడటం ఇండస్ట్రీలో హాట్ ఇష్యూగా మారింది.
వందలాది తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్లకు మదర్ గా..సిస్టర్ గా..వదినగా నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ప్రగతి. ఆమె ఓ సీనియర్ కమెడియన్ తనతో అసభ్యంగా ప్రవర్తించడాని చెప్పి షాక్ కి గురి చేసింది ప్రగతి. షూటింగ్ జరుగుతుండగానే కావాలనే ఇబ్బంది పెడుతూ ఎక్స్‌ట్రాలు చేసేవాడని.. పదేపదే తనను తాకాలని ప్రయత్నించే వాడని వాపోయింది. అతను పదే, పదే ఇబ్బంది పెట్టడంతో ఓ రోజు క్యారవాన్‌కి తీసుకెళ్లి.. పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ ఇవ్వడంతో అతను సైలెంట్‌గా అయ్యాడని ప్రగతి చెప్పింది. ఆ తరువాత ఆ స్టార్ కమెడియన్ తన గురించి బ్యాడ్ గా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ కమెడియన్ పేరు చెప్పపోవడంతో ఇప్పుడు అతడు ఎవరా అన్న చర్చా తెలుగు ఇండస్ట్రీలో మొదలయ్యింది.