నిర్మాతలకు సహాయంగా.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న హీరో విజయ్
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ఇండస్ట్రీని ఆదుకునేందుకు హీరో విజయ్ ఆంటోనీ ముందుకొచ్చారు. తన రెమ్యునరేషన్ 25 శాతం మేర తగ్గించుకున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో చేయబోయే 'తమీజసరన్, అగ్ని సిరాగుగల్..

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ఇండస్ట్రీని ఆదుకునేందుకు హీరో విజయ్ ఆంటోనీ ముందుకొచ్చారు. తన రెమ్యునరేషన్ 25 శాతం మేర తగ్గించుకున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో చేయబోయే ‘తమీజసరన్, అగ్ని సిరాగుగల్, ఖాకీ’ చిత్రాలకు కూడా దీనిని అమలు పరుస్తున్నట్లు ఆయన తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా నష్టపోయిన సినీ పరిశ్రమను ఆదుకోవాలంటే.. నటీనటులు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని పరిశ్రమ పెద్దలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో విజయ్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. కాగా తెలుగులో విజయ్ ఆంటోని.. బిచ్చగాడు, బేతాళుడు, రోషగాడు, కిల్లర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
Read More:
సిటీ డీసీపీకి కరోనా.. పోలీసుల్లో మొదలైన కలవరం!
విద్యార్థులను నేరుగా పై తరగతికి ప్రమోట్ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఒక్కో గదిలో 20 మందే!
బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..