తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఒక్కో గదిలో 20 మందే!
2020 మే 7వ తేదీతో సీఎం కేసీఆర్ విధించిన లాక్‌డౌన్ గడువు ముగియనుంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం కాకపోవడంతో లాక్‌డౌన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని సమాచారం. కాగా ఒకవేళ లాక్‌డౌన్ ఈ నెల పొడిగించినా..

గత కొద్ది రోజులుగా కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశమంతా ఆర్థిక వ్యవస్థ మొత్తాం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోవడంతో మనీ రొటేషన్ జరగలేదు. దీంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడక్కడ కొన్ని నిబంధనలతో కూడిన సడలింపులు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రభుత్వ ఆఫీసులు, మద్యం షాపులు తెరిచాయి. అలాగే లాక్‌డౌన్ కారణంగా విద్యా సంవత్సరం లాస్ అయిన సంగతి తెలిసిందే. వేసవి సెలవుల కంటే ఎక్కువగానే ఈసారి పాఠశాలలకు హాలీడేస్ వచ్చాయి. కాగా ప్రస్తుతం తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
2020 మే 7వ తేదీతో సీఎం కేసీఆర్ విధించిన లాక్‌డౌన్ గడువు ముగియనుంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం కాకపోవడంతో లాక్‌డౌన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని సమాచారం. కాగా ఒకవేళ లాక్‌డౌన్ ఈ నెల పొడిగించినా.. విద్యా సంవత్సరం ప్రారంభానికి ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసులు సింగిల్ డిజిట్ నెంబర్ నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెలాఖరు వరకూ వైరస్ అదుపులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది ప్రభుత్వం.
అయితే లాక్‌డౌన్ ముగిసిన అనంతరం తీసుకోవాల్సిన దానిపై విద్యా శాఖ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాఠశాలలు ప్రారంభమైనా.. నిబంధనలు కంటిన్యూ అవుతాయని సీక్రెట్ డైరెక్టర్ బి శేషుకుమారి వెల్లడించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడం జరుగుతాయని, తరగతి గదుల్లో ఎంతమంది ఉండాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. అయితే తరగతి గదిలో 20కి మంచి స్టూడెంట్స్ ఉండకుండా చూడాలని, రోజులో పని గంటల్లో మార్పులు? రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలా? అన్నదానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముందన్నారు అధికారులు.