AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిచ్చి ఫీక్స్‌కు చేరడం అంటే ఇదేనేమో.. రీల్స్‌ కోసం మనోడు ఏం చేశారో చూడండి!

టిక్‌టాక్, షేర్‌చార్ట్‌తో యువతకు అంటుకున్న రీల్స్‌ పిచ్చి ప్రస్తుతం పీక్స్‌కు చేరుకుంది. ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్‌ కావడంతో ఈ రీల్స్‌ పిచ్చి తగ్గుతుందనుకుంటే ఇన్‌స్టా గ్రామ్ వచ్చాక మరీ విపరీతంగా పెరిగిపోయింది. ఇన్‌స్టాలో ఫేమస్ కావడం కోసం ప్రమాదకర ప్రదేశాల్లో స్టంట్స్‌ చేసి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా రన్నింగ్‌ ట్రైన్లలో డోర్‌ దగ్గర నిలబడి వీడియో తీయడం, ట్రైన్‌ వస్తుంటే ఎదురుగా నిలబడి రీల్స్‌ చేయడం వంటికి చేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి  ఘటనలు ఎన్ని జరిగినా వీరిలో మాత్రం మార్పు రావట్లేదు. ఎవరో ఒకరు, ఒక్కడో అడక్క ప్రమాదకర రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. అలాంటి ఓ ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రైన్‌ వస్తుండగా రైల్వే ట్రాక్‌పై పడుకొని రీల్స్‌ చేసిన ఓ యువకుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

Viral Video: పిచ్చి ఫీక్స్‌కు చేరడం అంటే ఇదేనేమో.. రీల్స్‌ కోసం మనోడు ఏం చేశారో చూడండి!
Up Viral Video 1
Anand T
|

Updated on: Apr 10, 2025 | 11:01 AM

Share

Uttar pradesh: ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్‌ జిల్లాకు చెందిన రంజిత్ చౌరాసియా అనే ఓ యువకుడు ఇలాంటి ఓ స్టంట్‌ చేసి అరెస్ట్ అయ్యాడు. ఇన్‌స్టాలో ఫేమస్ అవ్వడం కోసం ప్రాణాలు పనంగా పెట్టి రీల్‌ చేశాడు. ఏకంగా ట్రైన్‌ కింద పడుకొని వీడియో రికార్డ్‌ చేశాడు. కుసుంభి రైల్వే స్టేషన్ సమీపంలో  ట్రైన్‌ వస్తుండగా పట్టాలపై పడుకున్నాడు. ఆ ట్రైన్‌ తనపై నుంచే వెళ్లే వీడియోను ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. తాను తీసిన వీడియోను ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేశాడు. దీంతో మనోడు నిజంగానే ఫేమస్ అయ్యాడు. ఈ వీడియో కాస్తా వైరల్‌ అయి పోలీసుల వరకు వెళ్లడంతో సీన్‌ రివర్స్‌ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

ఈ వీడియోపై స్థానిక రైల్వే పోలీసులు స్పందించారు. యువకుడు తన తప్పును ఒప్పుకుని, మళ్లీ ఇలాంటి పని చేయనని చెప్పి క్షమాపణ కోరినట్టు తెలిపారు. అయినప్పటికీ ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలు తీస్తూ భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపామని వారు చెప్పారు. సోషల్ మీడియా రీల్స్ కోసం ఇలాంటి ప్రమాదకర స్టంస్ట్ చేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..