AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌కు లక్షలు ఖర్చు చేస్తున్న వారికి గుడ్‌న్యూస్‌! ఒక్క బ్లడ్‌ టెస్ట్‌తో..

AIIMS శాస్త్రవేత్తలు గర్భాశయ క్యాన్సర్ చికిత్స ప్రభావాన్ని గుర్తించే కొత్త రక్త పరీక్షను అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష రక్తంలోని HPV DNA స్థాయిలను కొలుస్తుంది, ఇది కణితి పరిమాణంతో సంబంధం కలిగి ఉంటుంది. చికిత్సకు క్యాన్సర్ కణాల స్పందనను అంచనా వేయడంలో ఈ పరీక్ష సహాయపడుతుంది. ఖరీదైన స్కానింగ్ పద్ధతులకు ఇది చౌకైన ప్రత్యామ్నాయం.

క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌కు లక్షలు ఖర్చు చేస్తున్న వారికి గుడ్‌న్యూస్‌! ఒక్క బ్లడ్‌ టెస్ట్‌తో..
Cervical Cancer
SN Pasha
|

Updated on: Apr 10, 2025 | 10:47 AM

Share

క్యాన్సర్‌ నిర్ధారణ అయిన తర్వాత చికిత్స కోసం చాలా డబ్బు ఖర్చుపెడుతూ ఉంటారు. ఒక వైపు చికిత్స జరుగుతున్నా.. క్యాన్సర్‌ తగ్గుతుందో, పెరుగుతుందో కూడా అర్థం కాదు. అయితే ఇకపై అలాంటి డౌట్‌ అక్కర్లేదు. గర్భాశయ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న వారు.. ఒక సాధారణ రక్త పరీక్షతో క్యాన్సర్‌ తగ్గుతుందో లేదో తెలుసుకోవచ్చు. ఈ సరికొత్త పరిశోధనను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) వైద్యులు కనుగొన్నారు. ఎయిమ్స్‌ వైద్యులు రక్తంలో తిరుగుతున్న హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) DNA శకలాలను కనుగొన్నారు. గర్భాశయ క్యాన్సర్ కేసులలో ఎక్కువగా కారణమయ్యే వైరస్, వాటి స్థాయిలు కణితి పరిమాణంతో సంబంధం కలిగి ఉన్నాయి. రోగులకు చికిత్స ప్రారంభించినప్పుడు కణితి పరిమాణ స్థాయి తగ్గిందో, పెరుగుతుందో.. అసలు క్యాన్సర్‌ కణాలు చికిత్సకు ఎలా స్పందిస్తున్నాయో తెలుసుకోవచ్చు. ఈ పరిశోధన ఫలితాలు నేచర్ గ్రూప్ జర్నల్, సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమయ్యాయి.

మనదేశంలో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా వస్తోంది. దీంతో ఈ పరిశోధన ఎంతో కీలక ముందడుగుగా చెప్పొచ్చు. క్యాన్సర్‌ స్క్రీనింగ్, ఫాలో-అప్‌లు ఖరీదైనవి కాబట్టి, రక్త పరీక్ష చౌకైన ప్రత్యామ్నాయం కావచ్చు. “క్యాన్సర్ రోగులు.. తమకు అందుతున్న చికిత్స పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి పదేపదే పరీక్షలు, స్కాన్‌లు చేయించుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు ఈ పరిశోధన వల్ల రక్త పరీక్షతో ఖర్చును తగ్గించవచ్చు” అని AIIMS మెడికల్ ఆంకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మయాంక్ సింగ్ అన్నారు. కొన్నిసార్లు స్కాన్‌లలో కణితులు కనిపించకముందే రక్త బయోమార్కర్లు కనిపిస్తాయి – కాబట్టి ఇది త్వరగా పునఃస్థితిని గుర్తించడంలో కూడా సహాయపడుతుందని ఆయన అన్నారు.

అధ్యయనం ఏం కనుగొంది?

రెండు అత్యంత సాధారణ హై-రిస్క్ HPV జాతులు – HPV16, HPV18 DNA ట్రేస్ మొత్తాలను గుర్తించడానికి వైద్యులు చాలా సున్నితమైన మాలిక్యులర్ పరీక్షను ఉపయోగించారు. వారు చికిత్స ప్రారంభించని 60 మంది గర్భాశయ క్యాన్సర్ రోగులను ఎంపిక చేశారు. ఫలితాలను పోల్చడానికి వారు 10 మంది ఆరోగ్యకరమైన మహిళల నుండి నమూనాలను కూడా సేకరించారు. క్యాన్సర్ రోగులలో ప్రసరణ వైరల్ DNA సగటు స్థాయి 9.35 ng/µL (ఏకాగ్రత కొలత) అయితే ఆరోగ్యకరమైన మహిళల్లో ఇది 6.95 ng/µL. మూడు నెలల చికిత్స తర్వాత, ప్రసరణ DNA స్థాయి 7 ng/µLకు తగ్గిందని వైద్యులు కనుగొన్నారు. ఈ పరిశోధనను మరింత అభివృద్ధి చేసి.. త్వరలోనే పైర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని వైద్యులు కృషి చేస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.