AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలసటతోపాటు ఈ లక్షణాలు కనిపిస్తే మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్లే.. డేంజర్‌లో పడినట్లే..

దీనిని సాధారణ కాలేయ వ్యాధిగా పరిగణించినా.. కొన్ని సందర్భాల్లో తీవ్రమైనదిగా మారుతుంది.. సాధారణంగా దాని లక్షణాలు ప్రారంభ దశలలో కనిపించవు. ఇది క్రమంగా తీవ్రమైనదిగా మారుతుంది.. అందుకే.. ఫ్యాటీలివర్ ప్రారంభ లక్షణాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.. ఫ్యాటీ లివర్ ప్రారంభ లక్షణాలు ఏమిటి.. దానిని ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకోండి..

అలసటతోపాటు ఈ లక్షణాలు కనిపిస్తే మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్లే.. డేంజర్‌లో పడినట్లే..
Liver Health Tips
Shaik Madar Saheb
|

Updated on: Apr 10, 2025 | 10:25 AM

Share

శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి.. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడం.. జీవక్రియ చేయడం, పోషకాలను నిల్వ చేయడం వంటి ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే.. మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల కాలేయం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అంతేకాకుండా కాలేయ వ్యాధులపై అవగాహనతో ఉండటం ముఖ్యం.. అయితే.. కాలేయ వ్యాధి ఫ్యాటీ లివర్‌తో మొదలవుతుంది.. దీనిని సాధారణ కాలేయ వ్యాధిగా పరిగణించినా.. కొన్ని సందర్భాల్లో తీవ్రమైనదిగా మారుతుంది.. సాధారణంగా దాని లక్షణాలు ప్రారంభ దశలలో కనిపించవు. ఇది క్రమంగా తీవ్రమైనదిగా మారుతుంది.. అందుకే.. ఫ్యాటీలివర్ ప్రారంభ లక్షణాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.. ఫ్యాటీ లివర్ ప్రారంభ లక్షణాలు ఏమిటి.. దానిని ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకోండి..

అయితే.. ప్రారంభ లక్షణాలను విస్మరించడం కాలేయం కొవ్వు (ఫ్యాటీ లివర్) గా మారడానికి ప్రధాన కారణం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఆ తర్వాత శరీర భాగాలలో వ్యాధులు కనిపించడం ప్రారంభమవుతాయి.. చికిత్స కోసం లక్షల రూపాయలు అవుతాయి. కాబట్టి, ఫ్యాటీ లివర్ ప్రారంభ లక్షణాలను గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభించడం అవసరం..

ఫ్యాటీ లివర్ కారణాలు..

లివర్ ఫ్యాటీకి అనేక కారణాలు ఉన్నాయి. మద్యం – మాంసం అధికంగా తీసుకోవడం.. ఇంట్లో కంటే బయటే ఎక్కువగా తినడం. వేయించిన ఆహారం తినడం.. చెడు జీవనశైలి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి ఇవి కొన్ని ప్రధాన కారణాలు. ప్రారంభంలో, కాలేయం ఈ కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తుంది.. కానీ కాలేయ ప్రయత్నాలు విఫలమైనప్పుడు, అది కొన్ని లక్షణాలను చూపుతుంది. సమస్య తీవ్రం కాకుండా నిరోధించడానికి, అర్థం చేసుకోవడం ముఖ్యం.

కొవ్వు కాలేయం ప్రారంభ లక్షణాలు..

కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుందని.. అయితే.. కాలేయం దానిని పేరుకుపోకుండా ఆపలేనప్పుడు, కాలేయం కొన్ని సంకేతాల ద్వారా దానిని బహిర్గతం చేస్తుందని ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ సుభాష్ గిరి వివరిస్తున్నారు.

మొదటగా కనిపించే లక్షణం ఆకలి లేకపోవడం లేదా అస్సలు ఆకలి అనిపించకపోవడం.. ఇది కాకుండా, కడుపులో ఎప్పుడూ గ్యాస్ ఉన్నట్లు, కడుపు ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. కడుపులో నిరంతర తేలికపాటి నొప్పి.. కడుపు సరిగ్గా శుభ్రం కాకపోవడం. ఇవి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కొన్ని ప్రారంభ లక్షణాలు, వీటిని విస్మరించకూడదు..

బాగా అలసిపోవడం..

ఇది కాకుండా కాలేయం మరికొన్ని సంకేతాలను కూడా ఇస్తుంది. వీటిలో కొద్దిగా పని చేసిన తర్వాత బాగా అలసిపోయినట్లు అనిపించడం, బలహీనత భావన.. తరచుగా వికారం, వాంతులు కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి ప్రారంభ లక్షణాలు.

వైద్యుడిని సంప్రదించండి..

పైన పేర్కొన్న లక్షణాలను మీరు కొన్ని రోజులు లేదా వారాల పాటు ఎదుర్కొంటుంటే.. లేదా గమనించినట్లయితే.. మీరు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. డాక్టర్ సలహా మేరకు మొదట్లో మీ ఆహారం, దినచర్యను మార్చుకోవడం ద్వారా తీవ్రమైన కాలేయ వ్యాధి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..