Suriya: కోలీవుడ్‌లోకి బాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఏకంగా సూర్య సరసన ఛాన్స్ కొట్టేసిన వయ్యారి

తమిళ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషల్లో సూర్య కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు సూర్య

Suriya: కోలీవుడ్‌లోకి బాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఏకంగా సూర్య సరసన ఛాన్స్ కొట్టేసిన వయ్యారి
Suriya
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 22, 2022 | 5:17 PM

తమిళ్ స్టార్ హీరో సూర్య(Suriya) క్రేజ్ గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషల్లో సూర్య కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు సూర్య. ఇటీవలే విక్రమ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి సంచలనం సృష్టించారు సూర్య. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ పాత్రల్లో నటించి మెప్పించారు. సూర్య ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో వణంగాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. సూర్య హీరోగా నటిస్తూనే  2డీ – ఎంటర్‌ టెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు కూడా. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తుందని తెలుస్తోంది. అలాగే దీంతోపాటు చిరుతై శివ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ బాలీవుడ్ బ్యూటీని అనుకుంటున్నారట. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా కోలీవుడ్ లోకి అడుగుపెట్టాలని చూస్తుందట. ఆ అమ్మడు ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ దిశాపటాని. సూర్య, చిరుతై శివ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుందని టాక్. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే ను ఎపిక చేశారట ఇప్పుడు దిశాపటాని పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న దిశా.. తెలుగులోనూ నటించిన విషయం తెలిసిందే. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో నటించింది ఈ భామ. ఇక ఇప్పుడు సూర్య సినిమాలో నటిస్తుందని టాక్ కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి
Surya

surya and disha patani

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి