పిచ్చెక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్.. కుర్రాళ్లను ఆపడం కష్టమే..

Rajeev 

14 April 2025

Credit: Instagram

పాయల్ రాజ్‌పుత్ కెరీర్‌ను హిందీ టెలివిజన్ ధారావాహికలతో ప్రారంభించింది, "సప్నో సే భరే నైనా" (2010) లో సోనాక్షి పాత్రతో తొలి అడుగు వేసింది.

ఆ తర్వాత "ఆఖిర్ బహూ భీ తో బేటీ హీ హై" వంటి సీరియళ్లలో నటించింది. సినిమాల్లోకి వచ్చాక, 2017లో పంజాబీ చిత్రం "ఛన్నా మెరియా"తో డెబ్యూ చేసి, ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది.

తెలుగు సినిమా రంగంలో పాయల్ "ఆర్ఎక్స్ 100" చిత్రంతో పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. 

ఆర్ఎక్స్ 100కు ఉత్తమ నూతన నటిగా సైమా అవార్డు అందుకుంది పాయల్ రాజ్ పుత్.

ఆ తర్వాత "వెంకీ మామా" (2019), "డిస్కో రాజా" (2020), "మంగళవారం" (2023) వంటి చిత్రాల్లో నటించింది.

"మంగళవారం" క్రైమ్ థ్రిల్లర్‌లో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. పాయల్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన ఫోటోషూట్‌లు ఆకట్టుకుంటుంది. 

వ్యక్తిగత అప్‌డేట్‌లతో అభిమానులను అలరిస్తుంది. తాజాగా పాయల్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.