వారానికి 3 రోజులు కొబ్బరి నీళ్లు తాగితె.. అద్భుతమైన ప్రయోజనాలు
Phani CH
12 April 2025
Credit: Instagram
శరీర హైడ్రేషన్: కానీ కొబ్బరి నీళ్లు మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా శక్తిని కూడా ఇస్తాయి. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, మెగ్నీషియం శరీరాన్ని తక్షణమే తాజాగా ఉంచుతాయి.
పోషకాల సరఫరా: కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చి, ఆరోగ్యాన్ని పెంచుతుంది.
జీర్ణక్రియ సౌలభ్యం: కొబ్బరి నీళ్లలో ఉండే ఎంజైమ్‌లు, ఫైబర్ కడుపు సమస్యలను తగ్గించి, జీర్ణక్రియను మెరుగు పడేలా చేస్తాయి.
రోగనిరోధక శక్తి: కొబ్బరి నీళ్లలోయాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
గుండె ఆరోగ్యం: కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిచడం లో ఎంతగానో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బరువు నియంత్రణ: కొబ్బరి నీళ్లలో లో తక్కువ కేలరీలతో ఎక్కువ ఆకలిని అదుపు చేస్తుంది. దీని వల్ల బరువు తగ్గడానికి ఎంతగానో తోడ్పడుతుంది.
చర్మ సౌందర్యం: దీనిలో ఉండే విటమిన్లు చర్మం పై ముడతలు, ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయపడతాయి. మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. చర్మానికి సహజ మెరుపును ఇచ్చి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
కిడ్నీ శుద్ధి: సహజ డైయూరెటిక్‌గా కిడ్నీలను శుభ్రం చేసి మూత్రపిండాలు, మూత్ర నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.