ఒక్క లిప్ లాక్ తో ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జీవితం నాశనం.. ఎవరంటే ?
Phani CH
12 April 2025
Credit: Instagram
సినిమాల్లో లిప్‌లాక్ సీన్‌లు కథను బట్టి లేదా ఆ పాత్రల యొక్క భావోద్వేగాలను చూపించడానికి ఒక భాగంగా ఉంటాయి.
ఈ సీన్‌లు కొన్నిసార్లు వివాదాస్పదంగా మారతాయి, ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో. మన సాంప్రదాయలు, సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల, ఈ సీన్‌లను హీరోయిన్ వ్యక్తిగత జీవితంతో నాశనం చేస్తుంటాయి.
అయితే మన టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన సిమ్రాన్ విషయంలో ఇలాంటి సమస్యే ఒకటి ఎదుర్కొంది.
టాలీవుడ్ లో సిమ్రాన్ ఎలాంటి రూమర్స్ లేకపోయినా కోలీవుడ్ లో మాత్రం సిమ్రాన్ పై అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి
అప్పట్లో కొరియోగ్రాఫర్ రాజు సుందరం, సిమ్రాన్ లవ్ ఎఫైర్ సాగిందట. వీరిద్దరకు అప్పట్లో ఎంగేజ్మెంట్ జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఇది ఇలా ఉంటే కమల్ హాసన్ హీరోగా నటించిన బ్రహ్మచారి సినిమాలో కమల్ తో లిప్ లాక్ సన్నివేశం రాజు సుందరంకి చెప్పకుండా నటించిందట.
దానివల్ల రాజు సుందరం, సిమ్రాన్ మధ్య తీవ్రమైన మనస్పర్థలు చివరికి ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగినట్లు వార్తలు వచ్చాయి.
అయితే కమల్ హాసన్.. తన రెండవ భార్య సారిక నుంచి విడిపోయాక.. సిమ్రాన్ అతడి ప్రేమలో పడినట్లు కూడా ప్రచారం జరిగింది.
కానీ అంతలోనే కమల్ గౌతమి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత సిమ్రాన్ కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది. పర్సనల్ లైఫ్ లో కూడా సిమ్రాన్ ఇబ్బందులు ఎదుర్కొంది.