Salman Khan: అభిమాని పై సీరియస్ అయిన సల్మాన్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్
సల్మాన్ ఖాన్ తరచుగా విమానాశ్రయంలో కనిపిస్తూనే ఉంటాడు. అభిమానులకు సల్మాన్ తారసపడినప్పుడు కొంతమంది ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు. కొన్నిసార్లు అభిమాని సెల్ఫీ కోసం అడిగితే, అతను సంతోషంగా పోజులిచ్చాడు. కానీ, కొన్నిసార్లు సీరియస్ అయ్యాడు. తాజాగా మరోసారి అభిమాని పై సల్మాన్ ఖాన్ అసహనం వ్యక్తం చేశాడు.

తమ అభిమాన హీరోలు కనిపిస్తే ఫోటోలు దిగాలని, హయ్ చెప్పాలని చాలా మంది అభిమానులు ఎగబడుతూ ఉంటారు. కొంతమంది హీరోలు ఓపికగా ఫొటోలకు ఫోజులు ఇస్తే మరికొంతమంది మాత్రం సీరియస్ అవ్వడం. అభిమానుల పై అసహనం వ్యక్తం చేయండం మరికొంతమంది కోపాన్ని ఆపుకోలేక కొట్టడం.. ఫోన్ లు లాక్కొని విసిరేయడం చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా అదే చేశాడు. ఓ అభిమాని పై సీరియస్ అయ్యాడు భాయ్ జాన్. సల్మాన్ ఖాన్ తరచుగా విమానాశ్రయంలో కనిపిస్తూనే ఉంటాడు. అభిమానులకు సల్మాన్ తారసపడినప్పుడు కొంతమంది ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు. కొన్నిసార్లు అభిమాని సెల్ఫీ కోసం అడిగితే, అతను సంతోషంగా పోజులిచ్చాడు. కానీ, కొన్నిసార్లు సీరియస్ అయ్యాడు. తాజాగా మరోసారి అభిమాని పై సల్మాన్ ఖాన్ అసహనం వ్యక్తం చేశాడు.
సల్మాన్‌ఖాన్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తూ కనిపించాడు. ఆ సమయంలో పక్కనే వెళ్తున్న ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీశాడు. కూల్ గా ఉండే సల్మాన్ ఖాన్ కు ఒక్కసారిగా కోపం వచ్చింది. సెల్ఫీలు తీసుకోవడం మానేయాలని అన్నాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటున్న అభిమాని సల్మాన్ ను ఇబ్బంది పెట్టలేదు.. పాపం దూరం నుంచే అతను వీడియో తీసుకున్నాడు. అయినా కూడా సల్మాన్ అలా సీరియస్ అవ్వడం పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. .
వైరల్ అవుతున్న ఈ వీడియోపై పలువురు కామెంట్స్ చేస్తూ.. ‘అతను దూరం నుంచి సెల్ఫీలు దిగడం తప్పా.? అభిమానులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా.? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సల్లూకు మద్దతుగా నిలిచారు. సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉంది. అందుకే మరింత జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా అతని సెక్యూరిటీ గార్డులు చాలా జాగ్రత్తగా ఉన్నారని కొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ఇటీవల అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ కలిసి హాజరయ్యారు. ఈసారి ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు..’కు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
Salman Khan angry at a fan who was trying to take a selfie video with him byu/KramerDwight inBollyBlindsNGossip
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




