Orange Movie: ఆరెంజ్ టైటిల్ పెట్టడానికి కారణం అదే.. చరణ్ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా ?..
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా అరెంగేట్రం చేసినా తొలి చిత్రానికి డిజాస్టర్ అందుకున్నాడు. చిరుత సినిమా తర్వాత ఆయనకు ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది. కానీ ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుని డిజాస్టర్ అయిన ఆరెంజ్.. ఇటీవల రీరిలీజ్ అయ్యి మంచి వసూళ్లు రాబట్టింది.
మెగా హీరో రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. జక్కన్న డైరెక్షన్లో వచ్చిన ట్రిపుల్ ఆర్ మూవీతో హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నాడు చరణ్. కానీ కెరీర్ తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను.. విమర్శలను ఎదుర్కొన్నాడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా అరెంగేట్రం చేసినా తొలి చిత్రానికి డిజాస్టర్ అందుకున్నాడు. చిరుత సినిమా తర్వాత ఆయనకు ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది. కానీ ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుని డిజాస్టర్ అయిన ఆరెంజ్.. ఇటీవల రీరిలీజ్ అయ్యి మంచి వసూళ్లు రాబట్టింది. మోడ్రన్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ కథను మరోసారి ప్రేక్షకులు ఆదరించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మ్యూజికల్ హిట్ ను రీరిలీజ్ చేయగా.. సూపర్ హిట్ అయ్యింది.
డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వం వహించిన ఈ సినిమా గురించి ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ఆరెంజ్ అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కారణం గురించి ఆసక్తికర వియయం బయటకు వచ్చింది. ఆరెంజ్ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచన తనకే వచ్చిందని అన్నారు డైరెక్టర్ భాస్కర్. సినిమా స్టోరీకి తగినట్లు ఉంటుందని ఆ టైటిల్ సెలెక్ట్ చేశానని. ప్రేమలోనూ హెచ్చు తగ్గులు ఉంటాయని తాను అనుకున్నాని.. ఒక వ్యక్తిపై ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదని.. దీనిని సూర్యోదయం, సూర్యస్తమయంతో పోల్చానని అన్నారు. ఈ రెండు సమయాల్లో సూర్యుడు ఆరెంజ్ రంగులోనే ఉంటాడని.. అందులో సూర్యోదయాన్ని ప్రేమ పెరగడాన్ని.. సూర్యాస్తమయం ప్రేమ తగ్గడాన్ని సూచిస్తుందని.. అందుకే ఆరెంజ్ అనే టైటిల్ పెట్టినట్లు చెప్పుకొచ్చారు.
ముందుగా ఈ చిత్రాన్ని న్యూయార్క్ లో షూట్ చేయాలని అనుకున్నారట. కానీ షెడ్యూల్ సమయానికి అక్కడ బాగా చలి ఉండడంతో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో షూట్ చేసినట్లు తెలిపారు. ఈ చిత్రంలోని ప్రతిసాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఆరెంజ్ సినిమాను మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. 2010లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ కాగా.. ఇటీవల రీరిలీజ్ చేయగా మంచి వసూళ్లు రాబట్టింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.