Tollywood : తెలుగు హీరోలకు విలన్స్‌గా మారిన బాలీవుడ్ స్టార్స్.. సైఫ్ అలా.. బాబీ ఇలా

కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Tollywood : తెలుగు హీరోలకు విలన్స్‌గా మారిన బాలీవుడ్ స్టార్స్.. సైఫ్ అలా.. బాబీ ఇలా
Saif Ali Khan
Follow us

|

Updated on: Oct 19, 2024 | 11:39 AM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బేర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దేవర మూవీ సెప్టెంబర్ 27న విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఇప్పటివరకు 500 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ నెగెటివ్ క్యారెక్టర్‌లో నటించాడు. ఈ సినిమా భారీగా రెమ్యునరేషన్ అందుకున్నాడు సైఫ్. దేవరలో సైఫ్ అలీఖాన్ భైరా పాత్రలో నటించారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అనుకున్నాడు సైఫ్.  ఈ సినిమా కోసం 12 కోట్లు అందుకున్నాడు.

ఇది కూడా చదవండి : అవును నిజం..! ఈవిడ.. ఆవిడే.. 10th క్లాస్ హీరోయిన్ను చూసి అవాక్ అవుతున్న నెటిజన్స్

సైఫ్ లానే మరో హీరో కూడా టాలీవుడ్ లోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అతనే బాబీ డియోల్. యానిమల్ సినిమాతో బాబీ డియోల్ విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా కోసం రూ.5 కోట్లు అందుకున్నాడు బాబీ. బాబీ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువ’ సినిమా కోసం కూడా బాబీ ఇదే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. 1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన దళపతి 69′ సినిమాకు కూడా కేవలం 5 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం విజయ్ 250 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడు.

ఇది కూడా చదవండి : మాఫియా డాన్‌తో దోస్తానా.. చేతులారా కెరీర్ నాశనం చేసుకుంది.. చివరకు జైల్లో

‘దేవర బడ్జెట్ దాదాపు 300 కోట్లు. ఈ సినిమా ఇండియాలో ఇప్పటివరకు 280 కోట్ల రూపాయల నెట్ బిజినెస్ చేసింది. దేవర తెలుగు వెర్షన్ రూ. 210 కోట్లు రాబట్టింది. హిందీ సినిమా దాదాపు రూ. 60 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.410 కోట్లు రాబట్టింది. దాని రెండో భాగం కూడా రావాల్సి ఉంది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన సైఫ్  భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. కాగా బాబీ మాత్రం తక్కువ అందుకోవడంతో ఆయనకు ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం బాబీ తెలుగులో బాలకృష్ణ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమాలోనూ బాబీ నటిస్తున్నాడు.

ఇది కూడా చదవండి : Tollywood : హీరోయిన్‌గా సీనియర్ నటి కూతురు.. కానీ అంతకు ముందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.