Sai Pallavi: సీతగా సాయిపల్లవి చూడచక్కగా ఉంది.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్ట్
బ్యాక్ టు బ్యాక్ బడా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే మూడు పెద్ద సినిమాలు రణబీర్ కపూర్ చేతిలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ స్టార్ హీరో దృష్టి అంతా నితీష్ తివారీ తెరకెక్కుతోన్న 'రామాయణం' పైనే ఉంది. ఈ సినిమా షూటింగ్ కొంతకాలం క్రితం ప్రారంభమైంది. '
‘యానిమల్’ సక్సెస్ అయినప్పటి నుంచి రణ్‌బీర్ కపూర్ క్రేజ్ మరింత పెరిగింది. రణబీర్ కపూర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ బడా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే మూడు పెద్ద సినిమాలు రణబీర్ కపూర్ చేతిలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ స్టార్ హీరో దృష్టి అంతా నితీష్ తివారీ తెరకెక్కుతోన్న ‘రామాయణం’ పైనే ఉంది. ఈ సినిమా షూటింగ్ కొంతకాలం క్రితం ప్రారంభమైంది. ‘రామాయణం’ మూడు భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో సీతా హరణం వరకు మాత్రమే కథను చూపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది.
సరే, ఇటీవల, లారా దత్తా, అరుణ్ గోవిల్ ఫోటోలు రామాయణం సెట్స్ నుంచి లీక్ అయ్యాయి, దీని పై నితీష్ తివారీ టీమ్ చాలా సీరియస్ గా ఉన్నారు. లీకుల బెడద ఎక్కువ కావడంతో.. దాంతో సెట్ కి ఫోన్‌లను తీసుకురావడంపై నిషేధించారు. రామాయణం సెట్ నుంచి ఒక్క ఫోటో కూడా లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే రణబీర్ కపూర్ షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతారో క్లారిటీ లేదు. ఇప్పుడు దీని పై క్రేజీ అప్డేట్ వచ్చింది.
నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’లో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. అలాగే సాయి పల్లవి సీతమ్మ పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర కోసం రణబీర్ కపూర్ చాలా కష్టపడుతున్నాడు. ఆర్చరీ కోచ్‌తో, కొన్నిసార్లు జిమ్‌లో హెడ్‌స్టాండ్ చేస్తున్న అతని ఫోటో వైరల్ గా మారింది.. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది ఓ జూనియర్ ఆర్టిస్ట్ షేర్ చేశారని తెలుస్తోంది. ” నిజానికి ‘రామాయణం’లో మనం ఏది చూసామో, అవన్నీ సినిమాలో చూపిస్తారు. ‘ఆదిపురుష’ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే పెద్దగా మార్పులు చేయడం లేదు. రిస్క్ తీసుకునే మూడ్‌లో మేకర్స్ కనిపించడం లేదు. సాయి పల్లవిని సీత రూపంలో చూశారని, ఆమె చాలా అందంగా ఉందని అందులో రాసుకొచ్చారు. రణబీర్ కపూర్ తో ఆమె చాలా బాగా కనిపించింది. లక్ష్మణ్ పాత్రలో నటిస్తున్న రవి దూబే ఈ పాత్రకు ఖచ్చితంగా సరిపోతాడని, నన్ను చూసి నవ్వాడని ఆ పోస్ట్ లో రాశారు. ఈ సినిమాలో రావణుడి పాత్రలో రాకింగ్ స్టార్ యష్ నటించడం లేదని ఇటీవలే వెల్లడైంది. రామ నవమి సందర్భంగా మేకర్స్ భారీ ప్రకటన చేయబోతున్నారని అంటున్నారు. చూడాలి మరి ఎలాంటి అప్డేట్ వస్తుందో..
A junior artist shares some details about #Ramayana from the sets . The shoot has begun with #RanbirKapoor a few days back pic.twitter.com/EVmjX3yarQ
— Crown_Kapoor (@Crown_Kapoor) April 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.