Shraddha Kapoor: స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తున్న అందాల భామ శ్రద్దా కపూర్
స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్.. కెరీర్ ఎర్లీ డేస్ నుంచి తన ఓన్ ఐడెంటిటీ కోసం కష్టపడుతున్నారు. గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అన్న సిగ్నల్స్ ఇస్తూనే.. పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాలతో అలరిస్తున్నారు.
బీటౌన్‌లో అందరికంటే ముందే పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన ఓ బ్యూటీ ఇప్పుడు కెరీర్‌లో టఫ్ సిచ్యుయేషన్‌ను ఫేస్ చేస్తున్నారు. కాంటెపరరీ హీరోయిన్స్ నుంచి గట్టి పోటి ఎదురవుతుండటంతో రేసులో నిలబడేందుకు కష్టపడుతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్.. కెరీర్ ఎర్లీ డేస్ నుంచి తన ఓన్ ఐడెంటిటీ కోసం కష్టపడుతున్నారు. గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అన్న సిగ్నల్స్ ఇస్తూనే.. పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాలతో అలరిస్తున్నారు. దీంతో నార్త్‌తో పాటు సౌత్‌లోనూ అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది.
ఆషిఖీ 2 సినిమాతో నేషనల్ సెన్సేషన్‌గా మారిన శ్రద్దా కపూర్.. ఆ తరువాత సాహో సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్నారు. తూ ఝూటీ మై మక్కార్ సినిమాలో చేసిన గ్లామర్ షోతో బీటౌన్ గ్లామర్ దివాగా మారిపోయారు. కానీ ఈ క్రేజ్ అవకాశాల విషయంలో మాత్రం హెల్ప్ అవ్వటం లేదు.
తన కాంటెంపరరీ హీరోయిన్స్ కృతి సనన్, దిశా పటాని వరుస అవకాశాలతో దూసుకుపోతుంటే.. శ్రద్దా కెరీర్ మాత్రం స్లో అండ్ స్టడీ అన్నట్టుగా సాగుతోంది. తూ ఝూటీ మై మక్కార్ లాంటి బిగ్ హిట్ తరువాత కూడా శ్రద్దా కెరీర్‌లో స్పీడు కనిపించటం లేదు. ప్రజెంట్ ఈ బ్యూటీ చేతిలో స్త్రీ సీక్వెల్ మాత్రమే ఉంది. స్త్రీ సినిమాతోనే స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు సీక్వెల్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌తో మళ్లీ బిజీ అవ్వాలనుకుంటున్నారు శ్రద్దా.