Ram Charan : రామ్ చరణ్ సినిమా కోసం రంగంలోకి లోఫర్ బ్యూటీ.. ఏ మూవీ కోసమంటే..
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇక ఇదే సినిమాలో తారక్ కొమురం భీమ్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు, పాటలు, ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఈ సినిమా తర్వాత టాప్ దర్శకుడు శంకర్ తో సినిమా చేయనున్నాడు చరణ్. చరణ్ కెరీర్ లో 15వ సినిమా గా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రెండు షడ్యూల్ ను పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ జూన్ వరకు పూర్తిచేసుకుని దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చునని అనుకున్నారు. అయితే ఇప్పుడు శంకర్ ఇండియన్ 2 పూర్తి చేసే పనిలో పడ్డారట. అనుకోని కారణాల వల్ల ఆగిపోయిన ఇండియన్ 2 ను తిరిగి ప్రారంభించాడట శంకర్. దాంతో చరణ్ సినిమా వాయిదా పడిందని అంటున్నారు. ఇదిలా ఉంటే చరణ్ జెర్సీ దర్శకుడితో సినిమా చేయనున్నాడు. జెర్సీ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరితో చరణ్ సినిమా చేస్తున్నాడు. శంకర్ సినిమా పూర్తయ్యేలోగా ఈ సినిమాను కంప్లీట్ చేయాలనీ చూస్తున్నాడట చరణ్. ఇక ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ దిశా పటానిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. దిశా లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చదవండి :