AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ వైపు సినిమాలు.. మరోవైపు రేసింగులు.. ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన టాలీవుడ్ హీరోయిన్.. గుర్తు పట్టారా?

ఐరన్ మ్యాన్ 70.3 మారథాన్‌ గురించి మనకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఫిట్ నెస్ ప్రియులకు బాగా తెలుసు. ఈ రేస్‌ శారీరక సామర్థ్యం, మానసిక బలం, సహనానికి పెను సవాలుగా నిలుస్తుంది. అలాంటి రేస్ ను ఏడాదిలో రెండు సార్లు పూర్తి చేసిందీ టాలీవుడ్ హీరోయిన్.

ఓ వైపు సినిమాలు.. మరోవైపు రేసింగులు.. ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన టాలీవుడ్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 08, 2025 | 9:48 PM

Share

కొందరు హీరోలు, హీరోయిన్లు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఇతర రంగాల్లోనూ ఆసక్తి చూపిస్తుంటారు. ఉదాహరణకు కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఇప్పుడు కార్ రేసింగుల్లో రయ్ రయ్ మంటూ దూసుకెళుతున్నాడు. అయితే అజిత్ ఒక్కడే కాదు కొందరు హీరోయిన్లు కూడా రేసింగుల్లో దూసుకుపోతున్నారు. అందులో ఈ ప్రముఖ హీరోయిన్ కూడా ఒకరు. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆమె విదేశాల్లో నిర్వహించే ట్రయథ్లాన్‌ పోటీల్లో పాల్గొంటోంది. అలా ఏడాది వ్యవధిలో రెండు సార్లు ఐరన్‌మ్యాన్‌ 70.3 మారథాన్ ను పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా తాజాగా రికార్డు నెలకొల్పింది. గతేడాది సెప్టెంబరులో తొలిసారిగా మెడల్‌ అందుకున్న ఆమె.. ఇప్పుడు స్వీడన్‌లో నిర్వహించిన రేస్‌లో సత్తా చాటి మరో పతకం అందుకుంది. ట్రయథ్లాన్ … పేరుకు తగ్గట్టుగానే ఈ పోటీలో మూడు రేసులుంటాయి. 1.9 కి.మీ. స్విమ్మింగ్, 90 కి.మీ. సైక్లింగ్, 21.1 కి.మీ. పరుగు ట్రయథ్లాన్‌లో భాగం. అత్యంత కష్టమైన పోటీల్లో ఇదొకటి. అందుకే శారీరకంగా, మానసికంగా ఎంతో బలంగా ఉన్నవారే ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో 2024 సెప్టెంబర్‌లో తొలిసారి ఈ ట్రయథ్లాన్‌ను పూర్తి చేసిన నటి.. తాజాగా జూలై 6న స్వీడన్‌లోని జోంకోపింగ్‌లో తన రెండో ఐరన్‌ మ్యాన్ 70.3ను విజయవంతంగా పూర్తి చేసింది. తొలిసారి కంటే రెండోసారి 32 నిమిషాల ముందే ఈ రేస్ పూర్తిచేయడం విశేషం. రేస్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుందీ అందాల తార. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్త పట్టారా? తను మరెవరో కాదు తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో నటించిన సయామీ ఖేర్.

2015లో తెలుగు చిత్రం రేయ్‌తో సినిమాల్లోకి అడుగు పెట్టింది సయామీఖేర్. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ గా నటించాడు. దీని తర్వాత ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించింది. ఇక 2021లో నాగార్జున అక్కినేనితో కలిసి వైల్డ్ డాగ్ మూవీలో NIA ఏజెంట్‌గా నటించింది. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘జాట్‌’లో కీలక పాత్ర పోషించింది.

ఇవి కూడా చదవండి

సయామీ ఖేర్ ట్వీట్..

ట్రయథ్లాన్‌లో ఏడాది పాటు శిక్షణ తీసుకున్న సయామి.. ఇప్పుడు రేసింగులో అదర గొడుతోంది. .. ‘పది నెలల్లో రెండు రేసులు పూర్తి చేయడం ఆనందంగా ఉంది. ప్రపంచానికి ఏదైనా నిరూపించాలన్నది నా కోరిక కాదు. నేనెప్పుడూ బయట నుంచి వచ్చే గుర్తింపు కోసం ఎదురుచూడను. ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ అనేది నా వ్యక్తిగత ప్రయాణం. అతి శీతల ప్రాంతంలో గడ్డకట్టే నీటిలో ఈత కొట్టడం, గుట్టల్లా ఉన్న ప్రాంతంలో సైక్లింగ్ చేయడం, అంతలోనే పీరియడ్స్ రావడం, ఆపై తుఫాన్ ప్రమాద హెచ్చరికలు.. ఇలాంటి ప్రతికూలతలన్నీ అధిగమించాను’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..