Preity Zinta: ఇండియన్ ఆర్మీకి ప్రీతి జింటా భారీ విరాళం.. ఎంతో తెలుసా? హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
బాలీవుడ్ ప్రముఖ నటి, ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమాని తన గొప్ప మనసును చాటుకుంది. భారత సైనిక వితంతువుల సంక్షేమ నిధి(ఏడబ్ల్యూడబ్ల్యూఏ)కి ఆమె భారీ విరాళం ప్రకటించారు. దీంతో ఈ అందాల తారపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇప్పటివరకు టైటిల్ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ టీమ్ కూడా ఒకటి. కానీ ఈసారి శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. తొలిసారి ట్రోఫీని గెల్చుకుంటామనే ధీమాతో టోర్నీలో ముందుకు సాగుతోంది పంజాబ్ టీమ్. ఇప్పటికే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు కూడా అర్హత సాధించింది. ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది. భారత సైన్యం సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA) కు రూ.1.10 కోట్లు విరాళంగా ఇచ్చింది. పంజాబ్ కింగ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధి నుంచి ప్రీతి ఈ విరాళాన్ని అందించింది. జైపూర్‌లో జరిగిన విరాళాల కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండ్‌కు చెందిన ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ప్రీతి జింటా కోటి రూపాయల విరాళాన్ని అందజేసి సంతోషాన్ని పంచుకుంది.
‘సాయుధ బలగాల కుటుంబాలకు అండగా నిలవడం మన బాధ్యత. మన సైనికులు చేసిన త్యాగాలకు మనం వెలకట్టలేం. కానీ మనం వారి కుటుంబాలకు అండగా ఉండి ముందుకు సాగడానికి మద్దతునిద్దాం. అందుకే సైనికుల కుటుంబాల సంక్షమం కోసమే ఈ విరాళాన్ని అందజేస్తున్నాను. ఈ మొత్తాన్ని సౌత్ వెస్టర్న్ కమాండ్ ఆర్మీ విభాగంలోని వీర నారీమణుల సాధికారితకు, వారి పిల్లల చదువుల కోసం వెచ్చించనున్నాం’ అని ప్రీతి జింటా పేర్కొంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఒక్కసారి కూడా కప్ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన పంజాబ్, తొలి టైటిల్‌ను గెలుచుకుంటామనే నమ్మకంతో ఉంది. ఎందుకంటే ఈసారి ఆడిన 13 మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ జట్టు 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆ జట్టు ముంబై ఇండియన్స్ తో ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే, పంజాబ్ కింగ్స్ జట్టు మొదటి క్వాలిఫయర్ ఆడటం దాదాపు ఖాయం అవుతుంది. దీని ప్రకారం, మొదటి క్వాలిఫయర్ గెలిచిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుందో లేదో చూడాలి.
ఐపీఎల్ లో ప్రీతి జింటా..
Our energy in the stands, our strength off the field. 😍
Our co-owner, Preity G Zinta cheered for our Shers in the win over @ChennaiIPL . 😌 pic.twitter.com/T8VlZo5tBw
— Punjab Kings (@PunjabKingsIPL) April 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








