AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balagam Actor: ఇండస్ట్రీలో విషాదం.. బలగం నటుడు కన్నుమూత.. డైరెక్టర్ వేణు సంతాపం..

బలగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు నటుడు జీవీ బాబు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని డైరెక్టర్ వేణు ట్విట్టర్ వేదిక తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు.

Balagam Actor: ఇండస్ట్రీలో విషాదం.. బలగం నటుడు కన్నుమూత.. డైరెక్టర్ వేణు సంతాపం..
Balagam Actor GV Babu
Rajitha Chanti
|

Updated on: May 25, 2025 | 10:57 AM

Share

తెలుగు సినీరంగంలో విషాదం నెలకొంది. బలగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి బలగం మూవీ డైరెక్టర్ వేణు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. జీవీ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. “జీవీ బాబు గారు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోకే గడిపారు. చివరి రోజుల్లో ఆయనను బలగం మూవీతో వెండితెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ పోస్ట్ చేశారు. జీవీ బాబు మృతి పై సినీప్రముఖులు, బలగం మూవీ నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.

కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన వేణు.. బలగం సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలు పోషించగా.. ఈ మూవీలో ప్రియదర్శి చిన్నతాత అంజన్న పాత్రలో కనిపించారు జీవీ బాబు. సహజ నటనతో ఆకట్టుకున్నారు. జీవీ బాబు రంగస్థల కళాకారుడు. ఇన్నాళ్లు రంగస్థలంపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. బలగం సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..