Kareena Kapoor: వామ్మో.. కరీనా కపూర్ ఇంట్లో ఆయాకు అంత జీతం ఇస్తారా.!

లలితా డిసిల్వా ఇప్పుడు దంపతుల రెండవ కుమారుడు జెహ్‌ను చూసుకుంటున్నారు. లలితా డిసిల్వా ఎల్లప్పుడూ తైమూర్, జెహ్‌తో కనిపిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లలిత డిసిల్వా కరీనా కుటుంబం గురించి అలాగే ఆమె జీతం గురించి మాట్లాడింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Kareena Kapoor: వామ్మో.. కరీనా కపూర్ ఇంట్లో ఆయాకు అంత జీతం ఇస్తారా.!
Kareena Kapoor
Follow us

|

Updated on: Jul 29, 2024 | 2:21 PM

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, నటుడు సైఫ్ అలీ ఖాన్‌ పెళ్లి అప్పట్లో ఓ సంచలనమనే చెప్పాలి. ఈ జంటకు తైమూర్ అనే కొడుకు ఉన్నాడు. ఈ బుడ్డోడి ఫోటోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే కరీనా తన కొడుకుతో ఎక్కువగా కనిపించదు. దానికి కారణం యత్నము లలితా డిసిల్వా అనే నానీ దగ్గర పెరిగాడు. లలితా డిసిల్వా ఇప్పుడు దంపతుల రెండవ కుమారుడు జెహ్‌ను చూసుకుంటున్నారు. లలితా డిసిల్వా ఎల్లప్పుడూ తైమూర్, జెహ్‌తో కనిపిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లలిత డిసిల్వా కరీనా కుటుంబం గురించి అలాగే ఆమె జీతం గురించి మాట్లాడింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి :  స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. అలనాటి అందాల తార గౌతమి కూతుర్ని చూశారా.?

లలితా డిసిల్వా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సైఫ్, కరీనా తమను తాము ఎలా చూసుకుంటారో వెల్లడించారు. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ చాలా సాధారణ వ్యక్తులు. కరీనా-సైఫ్‌లు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది తిన్నా, సిబ్బంది కూడా వడ్డిస్తారు. ఆహారంలో తేడా లేదు. కొన్నిసార్లు మేము కలిసి కూర్చుని కూడా తింటాము. మేము కలిసి మంచి సమయాన్ని గడుపుతాము,’ అనిఆమె తెలిపింది.

ఇది కూడా చదవండి :Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!

‘లలితా డిసిల్వాకి నెలకు 2.5 లక్షల జీతం వస్తుందా?’ ఒక ప్రశ్న ప్రశ్నకు లలితా డిసిల్వా క్లారిటీ ఇచ్చారు. ‘2.5 లక్షల రూపాయలా.? అలా ఉండి ఉంటే బాగుండేది.. ఇవన్నీ పుకార్లు మాత్రమే అని తెలిపారు. లలితా డిసిల్వా గత కొన్నేళ్లుగా తైమూర్, జెహ్‌లను చూసుకుంటున్నారు. ఆమె ఫోటోలు, వీడియోలు చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. కరీనా కపూర్ కూడా ఒక ఇంటర్వ్యూలో లలితా డిసిల్వా గురించి మాట్లాడింది. ‘ఆయాలు నా పిల్లలతో కలిసి భోజనం చేస్తారు. సైఫ్, నేను ఇటీవల లంచ్ చేస్తున్నాం. ఒకసారి తైమూర్ ఆయాను ‘ఎందుకు అక్కడ కూర్చున్నావు’ అని అడిగాడు? అప్పటి నుండి, తైమూర్, జెహ్ వారి నానీతో కలిసి భోజనం చేస్తారు అని తెలిపింది. కరీనా కపూర్ ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే కరీనా తన పిల్లలతో ఫోటోలు, వీడియోలను సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ చేస్తుంది. కరీనా పోస్ట్‌లపై అభిమానులు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కరీనా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. కరీనాకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై