Shah Rukh Khan: అలాంటివి ఇండియాలో తయారు చెయ్యొద్దు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన షారుక్ ఖాన్

ప్రస్తుతం బాలీవుడ్ లోని సూపర్ స్టార్లలో షారుఖ్ ఖాన్ కూడా ఒకడు. అంతేకాదు దేశంలో అత్యంత ధనిక నటుల్లో ఒకరు. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ జీరో నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు అతను వేల కోట్ల రూపాయలకు యజమాని అయ్యాడు. కొన్ని నివేదికల ప్రకారం షారుఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ 870 మిలియన్ డాలర్లు. అంటే ఆయన ఆస్తి దాదాపు 7,300 కోట్ల రూపాయలు.

Shah Rukh Khan: అలాంటివి ఇండియాలో తయారు చెయ్యొద్దు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన షారుక్ ఖాన్
Shah Rukh Khan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 03, 2025 | 9:34 AM

ఇండియాలోనే  అత్యంత సంపన్న నటులలో బాలీవుడ్ బాద్షా  షారుఖ్ ఖాన్ ఒకరు. తిరుగులేని హీరోగా రాణిస్తున్నాడు షారుక్. ఆయన ఆస్తులు 7,300 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. షారుఖ్ ఖాన్ ఇంత రిచ్ కావడానికి కేవలం సినిమాలే కాదు యాడ్స్ ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నాడు కింగ్ ఖాన్. ఏ యాడ్ వచ్చినా చేసి కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటాడు. షారుఖ్ ఖాన్  పాన్ మసాలా వాణిజ్య ప్రకటనలలో కూడా నటించాడు. అవి హానికరమైనవి అని తెలిసి కూడా వాటిని ఎందుకు ప్రమోట్ చేశాడన్న విమర్శల పై షారుఖ్ ఖాన్ గతంలోనే మాట్లాడాడు.

అది 2006. షారూఖ్ ఖాన్ శీతల పానీయాల కోసం ఒక ప్రకటన చేసాడు. దాని పై చాలా విమర్శలు వచ్చాయి. అప్పుడు షారూఖ్ ఖాన్ సూటిగా సమాధానం ఇచ్చాడు. “ఈ శీతల పానీయాలను నిషేధించాలని నేను సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన దేశంలో అమ్మడానికి వీలు లేదు. పిల్లలకు చెడుగా అనిపిస్తే బ్యాన్ చేయండి’ అని షారుక్ ఖాన్ అన్నారు. అలాగే ‘ధూమపానం చెడ్డది. అలాంటప్పుడు ఈ దేశంలో సిగరెట్ తయారీని అనుమతించవద్దు. శీతల పానీయాలు చెడ్డవని మీరు భావిస్తే, వాటిని తయారు చేయనివ్వవద్దు. అది మన ప్రజలకు విషపూరితమైతే, దానిని భారతదేశంలో తయారు చేయనివ్వవద్దు” అని షారుక్ ఖాన్ అన్నారు.

‘మీకు ఆదాయం వస్తుంది కాబట్టి మీరు దాన్ని ఆపడం లేదు. కొన్ని ఉత్పత్తులు హానికరం అని మీరు భావిస్తే మీరు వాటిని ఆపడం లేదు. ఎందుకంటే వాటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. నా ఆదాయాన్ని ఆపుకోలేను. నేను నటుడిని. ఏదో ఒకటి చేసి దాని ద్వారా ఆదాయం పొందాలి. మీరు ఏదో తప్పుగా భావిస్తే, దాన్ని ఆపండి. ఎలాంటి ఇబ్బంది లేదు’ అని షారుఖ్ ఖాన్ అన్నారు. షారుక్ ఖాన్ పాన్ మసాలా ప్రకటన చేసినప్పుడు విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ దాన్ని ఆపలేదు. అలాగే అక్షయ్ కుమార్ కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. దాంతో అతను ఆ యాడ్ ను వదిలేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి