Saif Ali Khan: స్టార్ హీరో నుంచి పవర్‏ఫుల్ విలన్‏గా సైఫ్.. సౌత్ హీరోలను ఢీకొట్టేందుకు సిద్ధమైన..

ఇందులో రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో సైఫ్ పాత్ర భయపెట్టే విధంగా కనిపిస్తున్నారు. కానీ విజువల్ ఎఫెక్ట్ వర్క్ సరిగా లేకపోవడంతో ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో రీచ్ కాలేదు.

Saif Ali Khan: స్టార్ హీరో నుంచి పవర్‏ఫుల్ విలన్‏గా సైఫ్.. సౌత్ హీరోలను ఢీకొట్టేందుకు సిద్ధమైన..
Saif Ali Khan
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 16, 2023 | 1:21 PM

సైఫ్ అలీ ఖాన్.. పాన్ ఇండియా సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. మూడు దశాబ్దాలపాటు సక్సెస్ ఫుల్ హీరోగా కెరియర్ కొనసాగించిన ఈ హీరో.. ఇప్పుడు ఎలాంటి రోల్ అయిన చేసేందుకు సిద్ధమయ్యాడు. హీరోగానే కాదు.. ప్రతినాయకుడిగానూ మెప్పిస్తానంటున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న ఆదిపురుష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ఇందులో రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో సైఫ్ పాత్ర భయపెట్టే విధంగా కనిపిస్తున్నారు. కానీ విజువల్ ఎఫెక్ట్ వర్క్ సరిగా లేకపోవడంతో ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో రీచ్ కాలేదు.

ఇక ఈ సినిమానే కాకుండా మరిన్ని సౌత్ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు సైఫ్. నేరుగా తెలుగు తెరపై సందడి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్న సైఫ్.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న చిత్రంలో సైఫ్ నటించనున్నారట.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం సైఫ్ ను ఎంపిక చేయగా.. అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నేరుగా తెలుగు సినిమాలో ప్రతినాయకుడిగా రాబోతున్న సైఫ్.. సౌత్ ఆడియన్స్ అంచనాలను అందుకుంటాడా ? లేదా ? అనేది చూడాలి.