Ranbir Kapoor: తెలుగు డైరెక్టర్ మీదే నమ్మకం పెట్టుకున్న బాలీవుడ్ హీరో రణబీర్..!
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తన ఆశలన్ని ఆ తెలుగు డైరెక్టర్ మీదే పెట్టుకున్నారు. నార్త్ డైరెక్టర్స్‌తో డిఫరెంట్ మూవీస్ చేసిన రణబీర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వలేకపోతున్నారు. దీంతో తనను కమర్షియల్ స్టార్‌గా నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే బాధ్యత ఓ తెలుగు దర్శకుడి చేతిలో పెట్టారు రణబీర్. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న యానిమల్ సినిమాతో హీరో కమర్షియల్ లెక్కలు మార్చేయాలని ఫిక్స్ అయ్యారు.

అర్జున్ రెడ్డి సినిమాతో నేషనల్ సెన్సేషన్‌గా మారిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన సందీప్, సెకండ్ మూవీతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసిన సందీప్, మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. షాహిద్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇవ్వటమే కాదు నెగెటివ్ రివ్యూస్‌తో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించారు.
బాలీవుడ్‌లో బిగ్ బ్యాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన సందీప్‌తో వర్క్ చేసేందుకు నార్త్ స్టార్స్ అంతా క్యూ కట్టారు. కానీ సందీప్ మాత్రం చార్మింగ్ హీరో రణబీర్ కపూర్‌తో ఓ ఎమోషనల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను ప్లాన్ చేశారు. బ్రహ్మాస్త్ర లాంటి బిగ్ హిట్ తరువాత యానిమల్ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు రణబీర్. ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న చాక్లెట్ భాయ్, యానిమల్ రిలీజ్ తరువాతే నెక్ట్స్ మూవీ విషయంలో డెసిషన్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు.
యానిమల్ మూవీ కోసం గతంలో ఎన్నడూ చేయనంత రగ్గడ్ రోల్ ప్లే చేశారు రణబీర్. ఈ సినిమాతో మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవటమే కాదు తన మార్కెట్ స్పాన్‌ను కూడా పెంచుకునేందుకు ట్రై చేస్తున్నారు. గతంలో పాన్ ఇండియా అటెంప్ట్స్ చేసినా నేషనల్ లెవల్‌లో తన మార్క్ చూపించటంలో ఫెయిల్ అయ్యారు రణబీర్. అందుకే యానిమల్‌తో పాన్ ఇండియా హీరోగా ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నారు.
ప్రజెంట్ ఫోకస్ అంతా ఈ సినిమా మీదే పెట్టిన రణబీర్ కపూర్, రిలీజ్ అయి రిజల్ట్ విషయంలో క్లారిటీ వచ్చే వరకు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారు. యానిమల్‌తో చేస్తున్న ప్రయోగం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు రణబీర్. అనుకున్న రేంజ్‌లో ఈ సినిమా సక్సెస్ అయితే రెమ్యూనరేషన్ నుంచి మార్కెట్ రేంజ్ వరకు అన్ని రకాలుగా తనకు హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. మరి రణబీర్ పెట్టుకున్న ఆశలు సందీప్ నిజం చేస్తారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.