Rare Photo: అమ్మ ఆదిపరాశక్తి ఒడిలో బాల మురుగన్.. కాలక్రమంలో సినీ పరిశ్రమలో నెంబర్ 1 హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..
Rare Photo: బాల్యం ఎవరికైనా అపురూపమే.. ఎంత వయసు వచ్చినా ఏ స్థాయికి చేరుకున్నా ఎవరికైనా తమ చిన్నతనంలోని జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని.. వాటిని తరచి చూసుకోవాలని..
Rare Photo: బాల్యం ఎవరికైనా అపురూపమే.. ఎంత వయసు వచ్చినా ఏ స్థాయికి చేరుకున్నా ఎవరికైనా తమ చిన్నతనంలోని జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని.. వాటిని తరచి చూసుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా సినీ హీరో, హీరోయిన్లు, క్రీడాకారుల ఫ్యాన్స్ అయితే తాము అభిమానించే వ్యక్తులకు సంబంధించిన ప్రతి చిన్న విషయం తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. తమకు ఇష్టమైన వారి చిన్నతనంలోని ఫోటోలను షేర్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా జీవితం అనే నాటక రంగం నుంచి నిష్క్రమించినా వారికి చెందిన ఫోటోలను చూసినా, వారి గురించి విన్నాం.. మళ్ళీ మళ్ళీ తలచుకుంటూనే ఉంటాం.. అలాంటి వ్యక్తుల్లో ఇద్దరు నటీమణులకు చెందిన ఫోటో అభిమానులను అలరిస్తుంది. సినీ నటి , రాజకీయ నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత తో పాటు.. అతిలోక సుందరి శ్రీదేవి ఫోటో ఇప్పటికీ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.
జయలలిత ఒడిలో నాలుగేళ్ల ‘బాలుడు’.. అప్పుడు ఎవరూ అనుకోలేదు.. ఈ బాల నటుడిగా నటించిన నటి.. భారత దేశ చలన చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టిస్తుందని.. భారతదేశం అంతటా సినీ ప్రేక్షకుల హృదయాలను దోస్తుందని. 1969లో ‘ నమ్ నాడు ‘తమిళ సినిమాలో జయలలితతో శ్రీదేవి నటించింది. శ్రీదేవి బాలనటిగా నాలుగు సంవత్సరాల వయస్సులో తమిళ చిత్రం తునైవర్‌తో వెండి తెరపై అడుగు పెట్టింది. తర్వాత ‘నామ్ నాడు’లో నటించింది. అనంతరం శ్రీదేవి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కలిసి చాలా సినిమాలు చేశారు. 1971లో.. ఇద్దరూ ఆది పరాశక్తిలో కనిపించారు.. ఇందులో ‘బేబీ శ్రీదేవి’ మురుగన్ పాత్రను పోషించింది.
ఈ ఇద్దరు మహిళా నటీమణులు చలనచిత్రపరిశ్రమలో తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కాలక్రమంలో జయలలిత తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి.. అమ్మగా మారి పేరుప్రఖ్యాతలు గాంచితే.. శ్రీదేవి హిమ్మత్ వాలా సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టి.. ఉత్తరాదిన కూడా నెంబర్ 1 హీరోయిన్ గా అనేక ఏళ్ళు బీ టౌన్ ను ఏలారు. అయితే జయలలిత బయో పిక్ లో శీదేవి నటించాలనుకున్నారు.. ఆమె కల తీరకుండానే అకస్మాత్తుగా మరచించారు. ఇక జయలలిత కూడా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించారు. ఈ ఇద్దరు లెజెండ్స్ మరణించినా ఎప్పటికీ చిరంజీవులే..
Also Read: 2021లో శ్రీవారిని దర్శించుకున్న కోటి మంది భక్తులు..టీటీడీకి రూ.833 కోట్ల ఆదాయం.. (photo gallery)