Yashmi Gowda: ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు.. బిగ్ బాస్ యష్మీ బ్రేకప్ స్టోరీ

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తమ గేమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వారిలో యష్మీ గౌడ ఒకరు. మొదటి నుంచి హౌస్ లో తన గేమ్ తో ఆకట్టుకుంటుంది యష్మీ గౌడ. బిగ్ బాస్‌కు ముందు ఈ అమ్మడి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.

Yashmi Gowda: ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు.. బిగ్ బాస్ యష్మీ బ్రేకప్ స్టోరీ
Yashmi Gowda
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 13, 2024 | 3:27 PM

బిగ్ బాస్ సీజన్ 8 పేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోంది. ఈ సీజన్ లో కొత్త కంటెస్టెంట్స్ తో పాటు పాత కంటెస్టెంట్స్ కూడా పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హౌస్ లో ఇప్పటికే 70 రోజులకు పైగా పూర్తయ్యింది.ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో సీరియల్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తమ గేమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వారిలో యష్మీ గౌడ ఒకరు. మొదటి నుంచి హౌస్ లో తన గేమ్ తో ఆకట్టుకుంటుంది యష్మీ గౌడ. బిగ్ బాస్‌కు ముందు ఈ అమ్మడి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. బెంగళూరు, కర్ణాటకలో జన్మించిన ఈ ఈ చిన్నది తన అందంతో ఆకట్టుకుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ నుంచి కెరీర్ మొదలు పెట్టనుంది. కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడే తన ఫ్రెండ్ తో కలిసి ఆడిషన్స్ కు వెళ్లింది.

ఇది కూడా చదవండి : Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఆ హీరోయినా..! జ్యోతిక మాత్రం కాదు

ఈ చిన్నది విద్యా వినాయక అనే సీరియల్ ల్లో అవకాశం అందుకుంది. 2017 లో ఈ సీరియల్‌తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన భామ అదిరిపోయే నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.ఆ ఆతర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి ఆకట్టుకుంది. నాగ భైరవి, స్వాతి చినుకులు, త్రినయని, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ లో నటించింది.

ఇది కూడా చదవండి : S. S. Rajamouli: రాజమౌళికి బాగా నచ్చిన నటి.. సావిత్రి, అనుష్క అనుకుంటే పప్పులో కాలేసినట్టే..

ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తన గేమ్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. కాగా యష్మీ గౌడ ఓ ఇంటర్వ్యూలో తన లవ్, బ్రేకప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను ఓ అబ్బాయిని ఇష్టపడ్డానని తెలిపింది. అతను కూడా తనను ఇష్టపడ్డాడని. ఇద్దరం కలిసి మా ఆలోచనలను షేర్ చేసుకునే వాళ్ళం అని తెలిపింది యష్మీ. కానీ ఓ రోజు ఉన్నట్టుండి వచ్చి. మనం ఇది ఆపేద్దాం.. నువ్వు ఇండస్ట్రీ కి సంబందించిన అమ్మాయివి కావడంతో మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు అని అన్నాడు. అతను చెప్పిన రీజన్ నాకు అర్ధం కాలేదు. నేను కూడా పెద్దగా ఆలోచించలేదు. సరే అని యాక్సెప్ట్ చేశాను అని చెప్పింది. అతను నన్ను వదిలించుకోవడానికి ఆ రీజన్ చెప్పాడు అని నాకు అనిపించింది. ఆతర్వాత నేను దాని గురించి అడగలేదు. నా బ్రేకప్ గురించి చెప్పడానికి నేను భయపడను ఎందుకంటే వేరే వాళ్లకు ఇలా జరగకూడదు. తనకు ఇలాంటి అబ్బాయే ఉండాలని లేదని ఫ్లోలో వెళ్ళిపోతాను.. మనసుకు నచ్చిన వాడు కనిపిస్తే ఆ లవ్ ఫీల్ వస్తుంది.. అంతే తప్పా వాడు ఎలా ఉన్నా నాకు ఓకే అని చెప్పుకొచ్చింది యష్మీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!