Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 బజ్‌కు ఊహించని హోస్ట్.. ప్రోమోతో క్లారిటీ ఇచ్చిన టీమ్

సీజన్ 7కు మించిన ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. అందుకు తగ్గట్టుగానే కంటెస్టెంట్స్ ను కూడా హౌస్ లోకి పంపనున్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఎవరు వెళ్తారన్నది మాత్రం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. బిగ్ బాస్ తో పాటు బిగ్ బాస్ బజ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 బజ్‌కు ఊహించని హోస్ట్.. ప్రోమోతో క్లారిటీ ఇచ్చిన టీమ్
Bigg Boss 8
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 27, 2024 | 7:20 PM

బిగ్ బాస్ సీజన్ 8 కోసం ప్రేక్షకులంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈసారి హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారు.? ఎలాంటి గొడవలు, అల్లర్లు జరుగుతాయో చూడటానికి ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. మరోసారి నాగార్జున బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సీజన్ 7కు మించిన ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. అందుకు తగ్గట్టుగానే కంటెస్టెంట్స్ ను కూడా హౌస్ లోకి పంపనున్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఎవరు వెళ్తారన్నది మాత్రం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. బిగ్ బాస్ తో పాటు బిగ్ బాస్ బజ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి : రవితేజ పక్కన లవర్‌గా, వదిన నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇప్పటికే చాలా మంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ బజ్ ను హోస్ట్ చేశారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారు బయటకు వచ్చిన తర్వాత బజ్ లో పాల్గొంటారు. అక్కడ తమ ఆట గురించి, హౌస్ లో జరిగిన విషయాల గురించి. ఎలిమినేట్ ఆవాసానికి కారణాలు ఇలా చాలా విషయాలను పంచుకుంటారు. అయితే ఈసారి సీజన్ 8 బజ్ కు ఎవరు హోస్ట్ గా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటివరకు శివాజీ, శోభ శెట్టి, ప్రియాంక , అశ్విని శ్రీ ఇలా కొంతమంది పేర్లు వినిపించాయి.

ఇది కూడా చదవండి : Ram Charan: అమ్మబాబోయ్..! రామ్ చరణ్ సిస్టర్ దుమ్మురేపిందిగా.. ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

కానీ ఇప్పుడు దీని పై క్లారిటీ వచ్చేసింది. బిగ్ బాస్ బజ్ కు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఈసారి బజ్ కు హోస్ట్ గా అర్జున్ అంబటి ఉండనున్నారు. “టైమ్ బాగుంటే సంతోషం.. టైమ్ బాగోకపోతే సంకోచం. టైమ్ బాగుంటే మనం ఏం చేసినా ఒప్పు.. అలా టైమ్ బాగున్న కొంతమంది బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారు. మరి వాళ్ల టైమ్ బ్యాడ్ అయితే? బిగ్ బాస్ బజ్ లోకి వస్తారు. లోపల మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి.. ఈ సీటు యమ హాటు” అంటూ డైలాగ్ తో అర్జున్ ప్రోమోను రిలీజ్ చేశారు. మరి ఈసారి బిగ్ బాస్ 2 ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!