Bigg Boss Telugu 7: ఈసారి మరింత క్రేజీగా బిగ్ బాస్.. హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న తల్లి కూతుళ్లు.?
పలు భాషల్లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ తెలుగులోనూ మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రకరకాల స్టార్స్ హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్స్ ను పూర్తి చేసుకుంది. త్వరలో ఏడో ఎపిసోడ్ కూడా ప్రారంభం కానుంది. బిగ్ బాస్ సీజన్ 1 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆతర్వాత రెండో ఎపిసోడ్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశారు. ఆతర్వాత నుంచి కింగ్ నాగార్జున బిగ్ బాస్ బాధ్యతను భుజాలకెత్తుకున్నారు.

బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే ఈ గేమ్ షో పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. గత సీజన్స్ కు మించి ఈ సీజన్స్ లో టాస్క్ లో, ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అంటున్నారు కింగ్ నాగార్జున. పలు భాషల్లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ తెలుగులోనూ మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రకరకాల స్టార్స్ హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్స్ ను పూర్తి చేసుకుంది. త్వరలో ఏడో ఎపిసోడ్ కూడా ప్రారంభం కానుంది. బిగ్ బాస్ సీజన్ 1 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత రెండో ఎపిసోడ్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశారు. ఆతర్వాత నుంచి కింగ్ నాగార్జున బిగ్ బాస్ బాధ్యతను భుజాలకెత్తుకున్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 టెలికాస్ట్ కు మరికొద్దిరోజులే సమయం ఉండటంతో బిగ్ బాస్ పై అంచనాలతో పాటు రూమర్స్ కూడా పెరిగిపోయాయి. ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్స్ వీరే అటు కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. టీవీ నటులు అమర్ దీప్ చౌదరి, తేజస్విని జంట, టీవి నటి శోభా శెట్టి , సింగర్ మోహన భోగరాజు,యూట్యూబర్ శ్వేతా నాయుడు, దుర్గా రావు దంపతులు. దీపికా పిల్లి, జబర్ధస్త్ పవిత్ర, నయని పావని, జబర్ధస్త్ వర్ష ఇలా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిద్దరు మిస్ అయినా కూడా మిగిలిన వారు దాదాపు కన్ఫామ్ అని టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈసారి బిగ్ బాస్ లో సురేఖ వాణి కూడా వెళ్లే ఛాన్స్ ఉందని టాక్ కూడా వినిపిస్తుంది. గతంలో కూడా సురేఖ బిగ్ బాస్ లోకి వెళ్లనున్నారని వార్తలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఆమె సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. కూతురుతో కలిసి రకరకాల ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తున్నరు. దాంతో ఆమె కూతురు సుప్రీత కూడా ఫెమస్ అయ్యారు. ఈ తల్లీ కూతుర్లలో ఒకరు బిగ్ బాస్ హౌస్ కు వెళ్లనున్నారని అంటున్నారు. సుప్రీత త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అందుకు బిగ్ బాస్ ఆమెకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ గేమ్ షో వల్ల ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వొచ్చని అంటున్నారు కొందరు. మరి ఈ తల్లి కూతుర్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారో లేదో చూడాలి. దీనిపై ఇంతవరుకు సురేఖ ఇంతవరకు స్పందించలేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
