శివ కార్తికేయన్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. రెమో, డాక్టర్ వరుణ్, డాన్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. తాజాగా శివ కార్తికేయన్ మావీరన్ అనే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగులో ఈ సినిమా మహావీరుడు అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ ను సాధించింది. జులై 14న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.