AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6: మరింత రెచ్చిపోయిన గీతూ.. టీషర్ట్ లోపల చేయిపెట్టినా పర్లేదు అంటూ..

బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో రచ్చ మాములుగా జరగడం లేదు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ పరిచయం లేని మొఖాలే.. ఇక వీళ్ళు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు ముఖ్యంగా గీతూ రాయల్..

Bigg Boss 6: మరింత రెచ్చిపోయిన గీతూ.. టీషర్ట్ లోపల చేయిపెట్టినా పర్లేదు అంటూ..
Bigg Boss
Rajeev Rayala
|

Updated on: Sep 10, 2022 | 7:49 AM

Share

బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో రచ్చ మాములుగా జరగడం లేదు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ పరిచయం లేని మొఖాలే.. ఇక వీళ్ళు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు ముఖ్యంగా గీతూ రాయల్.. గలాటా గీతూ అంటూ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆ పేరుకు న్యాయం చేయాలనీ చాలా ట్రై చేస్తుంది. గాలట చేస్తూ బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ చేస్తోంది. హౌస్ లో ఉన్నవారితో గొడవలు పెట్టుకోవడం.. ఆవేశంగా మాట్లాడటం.. అవతిలి వాళ్ళు చెప్పేది వినకుండా వాగ్వాదానికి దిగడంతో గీతూ గొంతు బిగ్ బాస్ లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడి ప్రవర్తనపై చలాకీ చంటి గీతూ కి క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి గీతూ తన ప్రవర్తనతో ప్రేక్షకుల్లో నెగిటివ్ ఇంప్రషన్ తెచ్చుకుంది. నిన్నటి ఎపిసోడ్ లో గీతూ రెచ్చిపోయింది.

గీతూ బాలాదిత్య పక్కన కూర్చొని అతడి మొహానికి దగ్గరగా కాలు మీద కాలేసుకుని ఊపుతూ కనిపించింది. కాస్త సవ్యంగా కూర్చో.. ఆ కాళ్లు ముఖం మీద పెట్టి ఊపడం బాలేదు అని చాలా పద్దతిగా మర్యాదగా చెప్పాడు బాలాదిత్య. ‘ఏ.. నీ మూతలో పెట్టి ఊపినానా? అని చిరాకుగా ముఖం పెట్టి వెటకారంగా మాట్లాడింది గీతు. ఎవరి మూతిలో పెట్టి ఊపినా తప్పే కదమ్మా అని బాలాదిత్య చెప్పుకొచ్చాడు. అయినా గీతూ పద్ధతి మార్చుకోలేదు. నాకు కదలడం అలవాడు.. సరిగా ఉండలేను అంటూ మరింత వెటకారంగా మాట్లాడింది. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బాలాదిత్యా, గీతూ పోటీపడ్డారు. ఈ పోటీలో గీతూ గెలవడం కోసం నానా యాగీ చేసింది. కెప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ లో ఏకంగా నెంబర్స్  తీసుకొని టీషర్ట్ లోపాల పెట్టేసుకుంది. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఎవరు అడిగినా.. ఇది నా స్ట్రాటజీ  అంటూ పొగరుతో మాట్లాడింది. నువ్ తీసుకుని టీ షర్ట్ లోపల వేసుకున్నావ్ కదా.. వాటిని ఎలా తీయాలని రోహిత్ అడగడంతో.. అది నా స్ట్రాటజీ.. కావాలంటే తీసుకో అని అంది గీతూ..నేను ‌న్యాయంగా ఆడను.. అన్యాయంగానే ఆడతా.. అది నా స్ట్రాటజీ.. పక్కవాళ్లు ఓడిపోవాలనేదే నా స్ట్రాటజీ అంటూ రెచ్చిపోయింది. దాంతో ప్రేక్షకులు, నెటిజన్లు గీతూ తీరు పై విమర్శలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..