Bigg Boss 6 Telugu: అర్జున్ కళ్యాణ్ కొంపముంచిన శ్రీసత్య .. చివరకు జైలుపాలయ్యాడుగా

కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతోంది బిగ్ బాస్. బిగ్ బాస్ ఇస్తున్న చిత్రవిచిత్రమైన టాస్క్ లు.. వాటి కోసం హౌస్ మేట్స్ పడుతున్న తంటాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

Bigg Boss 6 Telugu: అర్జున్ కళ్యాణ్ కొంపముంచిన శ్రీసత్య .. చివరకు జైలుపాలయ్యాడుగా
Bigg Boss Telugu Arjun Kaly
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 01, 2022 | 7:56 AM

బిగ్ బాస్ సీజన్ 6 నాలుగోవారం రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు, హౌస్ మేట్స్ మధ్య గొడవలు, ఏడుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతోంది బిగ్ బాస్. బిగ్ బాస్ ఇస్తున్న చిత్రవిచిత్రమైన టాస్క్ లు.. వాటి కోసం హౌస్ మేట్స్ పడుతున్న తంటాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇప్పటికే బిగ్ బాస్ లో ముగ్గురు కెప్టెన్స్ అయ్యారు. మొదటివారం బాలాదిత్య, రెండో వారం రాజ్, మూడో వారం ఆదిరెడ్డి కెప్టెన్ అయ్యారు. ఇక ఇప్పుడు నాలుగో కెప్టెన్ గా కీర్తి ఎంపిక అయ్యింది. ఈ సీజన్‌లో తొలి మహిళా కెప్టెన్ అయిన కీర్తి.. కెప్టెన్ సింహాసనంపై కూర్చుంది. దీంతో అందరికీ స్పూర్తి.. మా కెప్టెన్ కీర్తి అని స్లోగన్స్ చేశారు హౌస్ మేట్స్. మరోపక్క కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోయిన సత్య ఒక దగ్గర కూర్చోగా అర్జున్ అక్కడికి వెళ్లి ఆమె కాళ్ళు నొక్కుతూ కనిపించాడు.

ఇక ఈ వారం వరస్ట్ కంటెస్టెంట్ ఎవరో తేల్చుకోమని చెప్పాడు బిగ్ బాస్. దాంతో ఒకొక్కరు ఒకొక్కరిని నామినేట్ చేశారు. ఫైమా.. అర్జున్ కళ్యాణ్, ఆదిరెడ్డి.. చంటి, రాజ్.. గీతూ, సుదీప.. అర్జున్ కళ్యాణ్, చంటి.. అర్జున్ కళ్యాణ్ ,కీర్తి.. శ్రీహాన్, రేవంత్.. ఇనయ, ఆరోహి.. అర్జున్ కళ్యాణ్, కీర్తి.. అర్జున్ కళ్యాణ్, బాలాదిత్య.. చంటి, ఆర్జే సూర్య.. అర్జున్ కళ్యాణ్, అర్జున్ కళ్యాణ్.. చంటి, మెరీనా-రోహిత్.. అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్య.. ఫైమా, ఇనయ.. చంటి, గీతు.. చంటి, వాసంతి.. రాజ్ లను నామినేట్ చేసుకున్నారు.  కాగా వరస్ట్ పర్ఫార్మర్ గా ఎక్కువ ఓట్లు పడిన అర్జున్ కళ్యాణ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక అర్జున్ జైలుకు వెళ్ళడానికి నేనే అంటూ సత్య చెప్పుకొచ్చింది.. నా వల్లే ఇతనికి ఓట్లు పడ్డాయి.. ఇక నాకు సపోర్ట్ చేయడు అని అన్నది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.