Ashu Reddy: అమ్మ పుట్టిన రోజు స్పెషల్.. ఖరీదైన గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసిన అషూరెడ్డి.. ఏమిచ్చిందో తెలుసా?
తాజాగా తన తల్లి పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే సర్‌ప్రైజ్ చేసింది అషూరెడ్డి. సరికొత్త సుజూకీ కారును ఆమె పుట్టినరోజు కానుకగా అందించింది. కుమార్తె ఇచ్చిన బహుమతిని చూసి సంతోషంలో అషూ వాళ్ల అమ్మ ఎమోషనల్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను అషూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది .
టిక్ టాక్‌లో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ జూనియర్ సమంతంగా సమంతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అషూ రెడ్డి. ఇదే క్రేజ్‌తో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. పలు టీవీ షోల్లో పాల్గొంది. నటనతో, గ్లామర్‌తో ఆకట్టుకుంది. షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేటు సాంగ్స్‌లో కూడా ఆడిపాడింది. ఆ మధ్యన ఒకటి, రెండు సినిమాల్లో కూడా కనిపించింది. ఇలా పలు టీవీ షోలు, ఈవెంట్స్ తో బిజీగా ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. నిత్యం తన గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తోంది. తాజాగా తన తల్లి పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే సర్‌ప్రైజ్ చేసింది అషూరెడ్డి. సరికొత్త సుజూకీ కారును ఆమె పుట్టినరోజు కానుకగా అందించింది. కుమార్తె ఇచ్చిన బహుమతిని చూసి సంతోషంలో అషూ వాళ్ల అమ్మ ఎమోషనల్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను అషూ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది . ‘హ్యాపీ బర్త్ డే మామ్.. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తుంటాను’ అని ఈ సందర్భంగా అమ్మపై ప్రేమను కురిపించిందీ బిగ్ బాస్ బ్యూటీ.
కాగా ముందుగా తన తల్లి కోసం మూడు ఆప్షన్స్ పేపర్స్ మీద రాసింది. అందులో ఒకటి కొత్తకారు కాగా, మరొకటి జ్యువెల్లరీ, ఇంకోటి నో గిఫ్ట్స్. వాళ్ల మమ్మీకి ఈ మూడింటిలో ఒకటి ఎంచుకోవాలని చెప్పింది. ఈ మూడు ఆప్షన్స్ లో ఆమె కొత్త కారును సెలెక్ట్ చేసుకుంది. వెంటనే తన కోసం కొత్త సుజుకీ కారును తీసుకొచ్చింది. ఇంట్లో నుంచి తన తల్లి కళ్లు మూసి బయటకు తీసుకొచ్చి కారును చూపించింది. బిడ్డ ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆమె తల్లి ఆనందంలో మునిగి తేలింది. అషూను హగ్ చేసుకుని తన సంతోషాన్ని వెల్లడించింది. ప్రస్తుతం అషూరెడ్డి సర్‌ప్రైజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్మకు మంచి సర్‌ప్రైజ్ ఇచ్చావంటూ నెటిజన్లు అషూరెడ్డిని అభినందిస్తున్నారు. ఆమె తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా గతేడాది సెప్టెంబర్ లో అషూరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆమె తండ్రి ఇలాంటి కళ్లు చెదిరే గిఫ్ట్ ఇచ్చారు. మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన C200D మోడల్ కారును కూతురికి బహుమతిగా అందించారు. ఈ కారు ధర సుమారు రూ. 70 లక్షల వరకు ఉంటుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..