డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన బిగ్‌బాస్ ఫేమ్ దివి.. బ్లాక్ శారీలో నెటిజెన్లను ఫిదా చేసిన అందాల భామ.

దివి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్‌గా మారింది. నలుపు రంగు చీరలో వెంట్రుకలు విరబోసుకొని చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన బిగ్‌బాస్ ఫేమ్ దివి.. బ్లాక్ శారీలో నెటిజెన్లను ఫిదా చేసిన అందాల భామ.
Narender Vaitla

| Edited By: Pardhasaradhi Peri

Dec 17, 2020 | 10:18 PM

Bigg boss fame divi dance goes viral: బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మోడల్, నటి దివి. తనదైన అందంతో కుర్రకారు మతిపోగొట్టిన దివి బిగ్‌బాస్ హౌజ్‌లో కూడా చురుకుగా ఆడుతూ మంచి మార్కులు కొట్టేసింది. ఇక 50 రోజుల పాటు గేమ్ ఆడిన తర్వాత దివి బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇదిలా ఉంటే పేరుకు దివి షో నుంచి బయటకు వచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అందాల ముద్దుగుమ్మను లక్షల సంఖ్యలో నెటిజన్లు ఫాలో అవుతున్నారు. దివి కూడా బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా మారింది. తన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.

View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

ఈ క్రమంలోనే దివి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్‌గా మారింది. నలుపు రంగు చీరలో వెంట్రుకలు విరబోసుకొని చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దివి హావభావాలు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఈ వీడియో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలో వేల సంఖ్యలో లైక్‌లు రావడం విశేషం. ప్రస్తుతం దివిని ఇన్‌స్టాగ్రామ్‌లో 50 వేలకుపైగా ఫాలో అవుతున్నారు. ఇక వీడియో చూసిన ఆమె అభిమానులు దివి అందంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దివి వేసిన స్టెప్పులను మీరూ ఓసారి చూసేయండి మరి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu