AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా టీజర్‏ను విడుదల చేయనున్న నాగబాబు.. మెగా ఫ్యామిలీ నుంచి రానున్న మరో హీరో.. ఎవరంటే..

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నారు. రామ్ చరణ్‏కు వరసకు తమ్ముడైన పవన్ తేజా కొణిదల ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ఈ కథలో పాత్రలు కల్పితం'. మాధవి సమర్పణలో ఎంవిటి

ఆ సినిమా టీజర్‏ను విడుదల చేయనున్న నాగబాబు.. మెగా ఫ్యామిలీ నుంచి రానున్న మరో హీరో.. ఎవరంటే..
Rajitha Chanti
|

Updated on: Dec 17, 2020 | 8:52 PM

Share

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నారు. రామ్ చరణ్‏కు వరసకు తమ్ముడైన పవన్ తేజా కొణిదల ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటైర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కితుంది. అభిరామ్ ఎం ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. థ్రిల్లింగ్ ఎంటర్‏టైనర్‏గా రాజేష్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మేఘన హీరోయిన్‏గా నటిస్తుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‏కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్ర టీజర్‏ను డిసెంబర్ 18న విడుదల చేయనున్నట్లుగా సమాచారం. పవన్ తేజ్, మేఘన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందిస్తున్నారు.