దివంగత నటుడి ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఈ ఏడాది అత్యధికంగా వ్యూస్ రాబట్టిన సుశాంత్ సినిమా..

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరో అరుదైన రికార్డును సాధించాడు. కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా సినిమాల విడుదల వాయిదా పడిపోయాయి.

దివంగత నటుడి ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఈ ఏడాది అత్యధికంగా వ్యూస్ రాబట్టిన సుశాంత్ సినిమా..
Rajitha Chanti

|

Dec 17, 2020 | 8:32 PM

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరో అరుదైన రికార్డును సాధించాడు. కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా సినిమాల విడుదల వాయిదా పడిపోయాయి. కానీ చాలా వరకు అన్ని సినిమాలు నెట్‏ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి ఓటీటీలో విడుదల అయ్యాయి. 2020లో ఓటీటీ లో విడుదలై భారీ విజయాలను సాధించిన చిత్రాల జాబితా విడుదైంది.

అతి తక్కువ కాలంలోనే సూపర్ హిట్ సినిమాల్లో నటించి బాలీవుడ్ స్టార్ హీరోగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎదిగారు. ఆకస్మాత్తుగా ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్ బెచరా ప్రముఖ హాట్‏స్టార్ ఓటీటీలో విడుదైల మంచి విజయం సాధించింది. కాగా ఇప్పటివరకు ఈ సినిమాను 2020లో ఎక్కువ మంది వీక్షించిన ఓటీటీ చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.

ఆ తర్వాతి స్థానంలో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా రెండవ స్థానంలో నిలిచింది. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపినాథ్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తర్వాత అభిషేక్ బచ్చన్, ఆదిత్య రాయ్ కపూర్ జంటగా నటించిన ‘లూడో’ మూడో స్థానంలో.. రాఘవ లారెన్స్, అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీ’ నాలుగో స్థానాల్లో నిలిచాయి. అటు జాన్వీ కపూర్ నటించిన ‘గుంజన్ సక్సెనా ద కార్గిల్ గర్ల్’ ఐదో స్థానంలో నిలవగా.. విద్యుత్ జమాల్, శివలేక ఒబెరాయ్ ప్రధాన పాత్రలలో నటించిన ‘ఖుదా హఫీజ్’ ఆరో స్థానంలో నిలించింది. అలాగే అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా సంయుక్తంగా నటించిన ‘గులాబో సితాబో’ ఏడో స్థానంలో నిలవగా.. నయనతార నటించిన ‘మూకుట్టి అమ్మన్’ ఎనిమిదో స్థానాన్ని కైవసం చేసుకుంది. అటు జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్ మంగల్ వందాల్’ పదో స్థానంలో నిలిచింది. కాగా తెలుగు నుంచి మాత్రం ఒకే ఒక్క సినిమా ఎంపికైంది. నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కిన సినిమా ‘V’ సినిమా తొమ్మిదో స్థానంలో నిలిచింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu