మంచి సినిమాలు ఏ భాషలో చేసిన ఆదరిస్తారంటున్న బుట్టబొమ్మ.. కానీ తెలుగు హీరోయిన్ అనిపించుకోవడం కంటే..

ముకుందా సినిమాలో బాపు బొమ్మగా కనిపించిన హీరోయిన్ పూజాహెగ్డే తర్వాత తన డోసును పెంచేసింది. దీంతో

  • uppula Raju
  • Publish Date - 5:37 am, Fri, 18 December 20
మంచి సినిమాలు ఏ భాషలో చేసిన ఆదరిస్తారంటున్న బుట్టబొమ్మ.. కానీ తెలుగు హీరోయిన్ అనిపించుకోవడం కంటే..

ముకుందా సినిమాలో బాపు బొమ్మగా కనిపించిన హీరోయిన్ పూజాహెగ్డే తర్వాత తన డోసును పెంచేసింది. దీంతో వరుసగా అగ్రహీరోల సరసన అవకాశాలు లభించాయి. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఇక ఈ అమ్మడుకు తిరుగే లేకుండా పోయింది. ప్రస్తుతం పూజాకు టాలీవుడ్ బోర్ కొట్టేసిందట. అందుకే పాన్ ఇండియా మూవీస్‌పై లుక్కేస్తుంది ఈ అమ్మడు.

కరోనా వల్ల ఇటీవల షూటింగ్‌లకు విరామం ఇచ్చిన పూజా ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో తన మనసులోని మాటలను వెల్లడించింది. దక్షిణాది నటి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనే ముద్రలకు పరిమితమవ్వాలని తాను కోరుకోవడం లేదని అంటోంది. అన్ని భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియన్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనుందని చెబుతోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లో అగ్రకథానాయకులతో సినిమాలు చేస్తోంది ఈ సొగసరి. హార్డ్‌వర్క్‌తో పాటు అదృష్టం కలిసిరావాలనే సిద్ధాంతాన్ని తాను విశ్వసిస్తానని చెబుతోంది. ఎలాంటి వారసత్వం లేకుండా చిత్రసీమలో అడుగుపెట్టానని తొలినాళ్లలో పరాజయాలు ఎదురైనా నిరాశచెందకుండా నా ప్రతిభకు తగిన గుర్తింపు వచ్చే రోజు కోసం ఎదురుచూశానని తెలిపింది. మంచి సినిమాలు, పాత్రలు ఏ భాషలో వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అలాగని తెలుగుకే పరిమితం కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తానని వెల్లడించింది. తెలుగు నటి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనే పిలుపు కంటే భారతీయ నటి అనే గుర్తింపును కోరుకుంటున్నానని తన మనసులో మాటను బయటపెట్టింది.