AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్నాళ్లు కంటెంట్ కోసం.. కానీ ఇప్పుడు నిజంగానే ఏడిపించేశారు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 10 వారం పూర్తి చేసుకుని 11 వారంలోకి అడుగు పెట్టింది. ఈ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి నామినేషన్స్ కూడా హోరా హోరీగా సాగాయి. టాప్ కంటెస్టెంట్ తనూజ కెప్టెన్ కావడం వల్ల ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంది.

ఇన్నాళ్లు కంటెంట్ కోసం.. కానీ ఇప్పుడు నిజంగానే ఏడిపించేశారు..
Biggboss 9
Rajeev Rayala
|

Updated on: Nov 18, 2025 | 6:49 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9 లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ వారం హౌస్ లో ఆరుగురు హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు.  ఇమ్మానుయేల్,  కళ్యాణ్ పడాల, భరణి, సంజన, డెమాన్ పవన్, దివ్య నామినేషన్స్ లో ఉన్నారు. ఈ సీజన్ మొత్తం మీద మొదటిసారి ఇమ్మాన్యుయేల్ నామినేట్ అయ్యాడు. కాగా తనూజ దగ్గరున్న స్పెషల్ పవర్ తో రీతూ చౌదరిని సేవ్ చేసింది. దాంతో ఈ వారం నామినేషన్స్ నుంచి రీతూ తప్పించుకుంది. ఇక ఈ ఆరుగురిలో ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారు. ఇదిలా ఉంటే ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ జరుగుతుంది. ఇప్పటికే పలువురు హౌస్ లోకి వచ్చారు. అందుకు సంబందించిన ప్రోమోలు విడుదల చేస్తున్నారు.

ముందుగా తనూజ చెల్లి హౌస్ లోకి వచ్చింది. అంతకు ముందు తనూజ అక్క కూతురు హౌస్ లోకి వచ్చింది. దాంతో తనూజ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చెల్లిని చూడగానే కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత హౌస్ లోకి సుమన్ శెట్టి భార్య ఎంట్రీ ఇచ్చారు. భార్యను చూడగానే సుమన్ శెట్టి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమెతో మాట్లాడుతున్నంత సేపు సుమన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రేక్షకుల చేత కూడా కనిళ్ళు పెట్టిస్తుంది.

ఇక తనూజ అక్క కూతురు బుడిబుడి అడుగులు వేసుకుంటూ హౌస్ లో సందడి చేయడంతో.. సంజన ఎమోషనల్ అయ్యింది. ఆ చిన్నారి అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ తిరుగుతుంటే ఆ చిన్నారిని ఎత్తుకొని మురిసిపోయింది సంజన. ఆతర్వాత సోఫాలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. తన ఫ్యామిలీని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది. ఈ వీడియో కూడా ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ వీడియో చూసి మరీ ఇంతలా ఏడిపించాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరికొంతమంది సంజన ఎప్పుడు ఏడ్చినా.. కంటెంట్ కోసం అనిపించేది.. కానీ ఇప్పుడు నిజంగానే ఫీల్ అవుతున్నాం అని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.