ఏందిరా ఈ రచ్చ..! అసలేం జరుగుతుంది..!! వెక్కి వెక్కి ఏడ్చిన దివ్వెల మాధురి..!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దువ్వాడ (దివ్వల)మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, సీరియల్ నటి ఆయేషా జీనథ్. సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా ఎంట్రీ ఇచ్చారు.

బిగ్ బాస్ సీజన్ 9 మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే హౌస్ నుంచి కొందరు ఎలిమినేట్ అవ్వడంతో .. వైల్డ్ కార్డు ఎంట్రీలు ఈ ఆదివారం గ్రాండ్ గా జరిగాయి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి మొత్తం ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. వీరిలో నలుగురు సెలబ్రిటీలు కాగా మరో ఇద్దరు కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి కొత్త కంటెస్టెంట్ల రాకతో బిగ్ బాస్ హౌస్ మరింత ఆసక్తికరంగా మారింది. అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దువ్వాడ (దివ్వల)మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, సీరియల్ నటి ఆయేషా జీనథ్. సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
కొత్త కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారింది. తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రమోను విడుదల చేశారు. ఈ వీడియోలో దివ్వెల మాధురి ఎమోషనల్ అవ్వడం మనం చూడొచ్చు.. అసలేమైందంటే.. ఇమ్మాన్యుయేల్, సంజన, దివ్య, కళ్యాణ్ ఒకదగ్గర కూర్చొని మాట్లాడుతుండగా.. కళ్యాణ్ మధురిని పిలిచాడు. ఆమె రాగానే రండి కూర్చోండి అని మర్యాదగానే కళ్యాణ్ మాట్లాడాడు.. కానీ మాధురి ఒక్కసారిగా కూర్చోపోతే ఊరుకోరా..? అంటూ వెటకారంగా మాట్లాడింది.. దానికి కళ్యాణ్ కూడా ఏం అనకుండా.. ఈ రోజు ఇలా ఉంది.. రేపటి నుంచి షెడ్యూల్ మారుస్తాం అని అన్నాడు. మాధురి మాట్లాడుతూ.. నేను ఇక్కడికి వచ్చి అరగంట అయ్యింది అప్పుడు చెప్పొచ్చుగా ఏం చేస్తున్నారు.? అప్పుడు తెలియదా..? అని సీరియస్ గా మాట్లాడింది.
దానికి కళ్యాణ్ మీరు ఇలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి ఉంటుంది అని అన్నాడు. మాట్లాడండి అంటూ వెటకారంగా కళ్యాణ్ ను రెక్కగొట్టేలా మాట్లాడింది.. దాంతో చిన్న వాగ్వాదం జరిగింది. దివ్య కూడా మధ్యలో దూరి మీరు ఇక్కడ లేరు అందుకే చెప్తున్నా గొడవపడాలని కాదు అని చెప్పుకొచ్చింది. కుకింగ్ టీమ్ లో నేను ఒక్కదాన్నే కాదు.. ఇంకో ముగ్గురు కూడా ఉన్నారు అంటూ దివ్యపైన కూడా రెచ్చిపోయింది మాధురి. దాంతో గొడవ జరిగింది. ఆతర్వాత వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏంటి..? అంటూ కళ్యాణ్ పై సీరియస్ అయ్యింది మాధురి.. దాంతో కళ్యాణ్ కూడా గట్టిగానే అరిచి మాట్లాడాడు.. ఆతర్వాత దివ్య, మాధురి మధ్య కూడా గొడవ జరిగింది. ఫైనల్ గా మాధురి పక్కకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది.. అనాల్సిన మాటలన్నీ అని ఇప్పుడు.. ఏడిస్తే ఎలా అని కళ్యాణ్ భరణి దగ్గర చెప్పుకున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








