AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హౌస్ మేట్స్‌కు చుక్కలు చూపించిన సుమన్ శెట్టి.. పాపం డిమాన్న్ బలి

బిగ్ బాస్ 9లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. హౌస్ లో బాండింగ్స్, ఏడుపులు, అరుపులు.. అబ్బో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. వారం వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

హౌస్ మేట్స్‌కు చుక్కలు చూపించిన సుమన్ శెట్టి.. పాపం డిమాన్న్ బలి
Bigg Boss9
Rajeev Rayala
|

Updated on: Nov 06, 2025 | 8:08 AM

Share

నిన్నటి ఎపిసోడ్ లో హౌస్‌లో ఓ రెబల్ ఉన్నాడు కనిపెట్టండి అంటూ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. కాగా నిన్నటి ఎపిసోడ్ లో పాలప్యాకెట్లు కొట్టేశాడు ఆ రెబల్. ఇంతకూ ఆ రెబల్ ఎవరు.? పాలప్యాకెట్లు కొట్టేసింది ఎవరు.? అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేశాడు. ఇక నిన్న ఉదయం రీతూ వెళ్లి ఫ్రిజ్ ఓపెన్ చేయగానే పాలప్యాకెట్లు కనిపించలేదు. దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది. అందరికి చెప్పింది పాల ప్యాకెట్లు కొట్టేశారు అని చెప్పింది రీతూ.. దాంతో ఎవరో కొట్టేశారు.? అంటూ అందరూ గుసగుసలాడుకున్నారు. ఇక దొంగ ఎవరు అంటూ అందరూ గెస్ చేసే పనిలో పడ్డారు. ముందుగా అందరూ సంజనని అనుమానించారు. సంజనకూడా వాళ్లు అనుమానించినట్టే నవ్వుతూ, దొంగతనం చేసినట్టే ప్రవర్తించింది. సుమన్ – దివ్య ఎవ్వరికీ అనుమానం రాకుండా ఓ రేంజ్‌లో యాక్టింగ్  చేశారు.

పాలు ఎవరు కొట్టేసినా ప్లీజ్ ఇచ్చేయండి అంటూ దివ్య యాక్టింగ్ చేసింది. సుమన్ శెట్టి అమాయకుడిలా తిరుగుతూ అందరిని మోసం చేశాడు. రేషన్ మేనేజర్ అయిన రీతూ మీద కూడా  చాలా మందికి డౌట్ వచ్చింది. ఆమె పాల ప్యాకెట్లు కొట్టేసి ఉంటుంది అంటూ అనుమానం వ్యక్తం చేశారు చాలా మంది. అందరూ ఒకరి మీద ఒకరు డౌట్ పడ్డారు కానీ.. రెబల్ ఎవరనేది మాత్రం కనిపెట్టలేకపోయారు. ఆ రెబల్స్ ఎవరో కాదు దివ్య, సుమన్ శెట్టి. కానీ ఎవ్వరూ వారిని కనిపెట్టలేకపోయారు. దాంతో కెప్టెన్సీ కంటెండర్‌షిప్ రేసు నుంచి మరొకరిని తప్పించే ఛాన్స్ రెబల్స్ అయిన దివ్య-సుమన్ శెట్టికి దక్కింది.

రీతూయే రెబల్ అయి ఉండొచ్చని తనూజ అనుమానం వ్యక్తం చేసింది. దివ్య ఓవరాక్షన్ చూసి నువ్వే రెబల్ ఎందుకు కాకూడదంటూ అని రాము రాథోడ్ డౌట్ పడ్డాడు. నిఖిల్ కూడా దివ్య అని ఫిక్స్ అయ్యాడు. పాలు తాగితే బాటిల్ ద్వారానే తాగాలి అని అందరి బాటిల్స్ తెచ్చి వాసన చూసింది రీతూ.. ఇంతలో దివ్య తన మీద డౌట్ వస్తుందేమో అని గౌరవ్ పై కూరగాయలు కట్ చెయ్యమని అరిచి గోల చేసింది. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాదన జరిగింది. కెమెరా దగ్గరికెళ్లి పాలు దొంగతనంలో రీతూ హ్యాండ్ ఉంది.. ఈ ఇంట్లో ఎవరూ రియల్‌గా లేరు అంటూ గౌరవ్ కెమెరా ముందు చెప్పుకున్నాడు. ఆతర్వాత అందరినీ కూర్చోబెట్టి నోటీస్ పంపించాడు బిగ్‌బాస్. మీ దృష్టిలో ఎవరు రెబల్ అనేది మీరు ఒక్కొక్కరూ చెప్పాలి. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు కంటెండర్‌షిప్ రేసు నుంచి తప్పుకుంటారు అని బిగ్‌బాస్ చెప్పాడు. ఎక్కువమంది డీమాన్ రెబల్ అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ మీరు గెస్ చేసినట్టు పవన్ రెబల్ కాదు అని చెప్పాడు బిగ్ బాస్. కానీ ఎక్కువ మంది ఓట్లు వేయడంతో పవన్ రేస్ నుంచి తప్పుకుంటున్నాడు అని అనౌన్స్ చేశారు. దాంతో అతన్ని రేస్ నుంచి తప్పించారు. దాంతో పవన్ కాస్త హర్ట్ అయ్యాడు.

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి