బిగ్ బాస్ నుంచి ఆమె అవుట్.. సడన్‌గా బయటకు పంపేశారు.. కారణం ఇదే
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం హౌస్ నుంచి ఒకరు సడన్ గా ఎలిమినేట్ అయ్యారు. ఊహించని విధంగా బిగ్ బాస్ నుంచి ఆమెను బయటకు పంపించేశారు. వారం మధ్యలో ఆమె ఎందుకు బయటకు వచ్చేసింది అని అభిమానులంతా ఆరా తీస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 9లో రచ్చ కంటిన్యూ అవుతుంది.కొత్త హౌస్ మేట్స్ వచ్చిన దగ్గర నుంచి హౌస్ రణరంగంగా మారింది. ఇక హౌస్ లో సభ్యులను రెండు టీమ్స్ గా డివైడ్ చేసి కెప్టెన్సీ టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే వారం వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతూ బయటకు వస్తున్న విషయం తెలిసిందే.. ఆదివారం వస్తే చాలు ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఆదివారం హౌస్ నుంచి భరణి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు వస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఓ బ్యూటీ సడన్ గా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిందని తెలుస్తుంది.
బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్స్ ద్వారా హౌస్‌లోకి వచ్చారు. వచ్చిన వారిలో అయేషా ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన ఆటతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది అయేషా.. హౌస్ లోకి వచ్చిన తర్వాత ఈ అమ్మడు ఎక్కువగా నోరేసుకు పడుతుంది. నామినేషన్స్ లోనూ ఓ రేంజ్ లో రచ్చ చేసింది అయేషా. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిందని తెలుస్తుంది. ఆరోగ్య సమస్యల కారణంగా అయేషా బయటకు వచ్చేసిందని తెలుస్తుంది.
గతంలో తమిళ్ బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న అయేషా.. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొని సందడి చేస్తుంది. ఇక అనారోగ్యం కారణంగా అయేషా హౌస్ నుంచి బయటకు వచ్చేసిందని తెలుస్తుంది. డీహైడ్రేషన్ కారణంగా అయేషా బయటకు వచ్చేసిందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యం సెట్ అవ్వడంతో తిరిగి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిందని టాక్. ఇక ఈ వారం నామినేషన్స్ లో రీతూ చౌదరి, తనూజ, రాము రాథోడ్, సాయి, కళ్యాణ్, రమ్య మోక్ష,సంజన, దివ్య ఉన్నారు. వీరిలో రమ్య మోక్ష ఈవారం హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఆమెకే తక్కువ ఓట్లు పడుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








