ఇదెక్కడి ట్విస్ట్ మావ..!! విడాకుల బాటలో టాలీవుడ్ సింగర్స్..? షాక్‌లో అభిమానులు
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, బ్రేకప్ లు రెగ్యులర్ గా వినిపిస్తున్న వార్తలే.. హీరో, హీరోయిన్స్ చాలా మంది ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది సడన్ గా విడిపోతున్నాం అని అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ సింగర్స్ విడాకులు తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో విడాకులు , పెళ్లిళ్లు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఇండస్ట్రీలో ఈ మధ్య విడాకుల వార్తలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. స్టార్ హీరోల నుంచి దర్శకుల వరకు చాలా మంది విడాకులు తీసుకుంటూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. సమంత, నాగ చైతన్య దగ్గర నుంచి ఏఆర్ రెహమాన్ వరకు విడాకులు అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు మరో జంట కూడా విడిపోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ స్టార్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరూ విడాకులు తీసుకుబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా నెట్టింట వార్తలు వైరల్ అవుతున్న సంగతి కూడా తెలిసిందే.
కొంత కాలంగా వీరిద్దరికీ అస్సలు పడట్లేదని..దీంతో వీరు వేరు వేరుగా ఉంటున్నారని.. త్వరలోనే విడాకులు సైతం తీసుకుబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తామిద్దరం విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి స్పందించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో వీరిద్దరూ నిజంగానే విడిపోతున్నారా. ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఈ ఇద్దరూ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా శ్రవణ్ భార్గవి దీపావళి సందర్భంగా ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలకు ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అక్క, ఒక తమ్ముడు అది స్టోరీ.. హ్యాపీ దీపావళి అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్స్ అంతా హేమ చంద్ర ఎక్కడ.? మీ కూతురు ఎక్కడ.? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఈ ఇద్దరూ విడాకులు తీసుకోవడం కన్ఫర్మ్ అని నెటిజన్స్ అంటున్నారు. మరి దీని పై హేమచంద్ర, శ్రావణ భార్గవి ఎలా స్పందిస్తారో చూడాలి. కెరీర్ ఆరంభంలోనే హేమచంద్ర, శ్రావణ భార్గవి మంచి స్నేహితులు.. ఆ తర్వాత వీరిద్దరు 2009లో పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు హేమచంద్ర, శ్రావణ భార్గవి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








