Bigg Boss 8 : ఆ ఐదుగురు డమ్మీ కంటెస్టెంట్స్.. బయటకు వస్తూ నయిని షాకింగ్ కామెంట్స్
ముందుగా నామినేషన్స్‌లో ఉన్న నలుగురిలో గౌతమ్‌ని సేఫ్ చేశారు నాగార్జున. ఆదివారం కావడంతో కంటెస్టెంట్స్ మధ్య ఫన్నీ టాస్క్ లు పెట్టారు నాగ్. హౌస్ మేట్స్ ను రెండు టీమ్స్ గా చేసి మరి గేమ్స్ ఆడించారు. అలాగే కంటెస్టెంట్స్ హుషారుగా డాన్స్ లు కూడా చేశారు.
బిగ్ బాస్ హౌస్ లో నిన్న సండే కావడంతో కింగ్ నాగార్జున సందడి చేశారు. ఆతర్వాత ఒకొక్కరిని నామినేషన్స్ లో ఉన్న ఒకొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. ముందుగా నామినేషన్స్‌లో ఉన్న నలుగురిలో గౌతమ్‌ని సేఫ్ చేశారు నాగార్జున. ఆదివారం కావడంతో కంటెస్టెంట్స్ మధ్య ఫన్నీ టాస్క్ లు పెట్టారు నాగ్. హౌస్ మేట్స్ ను రెండు టీమ్స్ గా చేసి మరి గేమ్స్ ఆడించారు. అలాగే కంటెస్టెంట్స్ హుషారుగా డాన్స్ లు కూడా చేశారు. గౌతమ్.. రోహిణి ని ఎత్తుకొని మరీ డ్యాన్స్ చేశాడు. ఆతర్వాత యష్మీతో గౌతమ్ డ్యాన్స్ చేశాడు. యష్మీతో గౌతమ్ డాన్స్ అదరగొట్టారు. దాంతో రోహిణి నాతో గౌతమ్ ఇలా డాన్స్ చేయలేదు సార్ అని నాగార్జున చెప్పింది. అక్కతో వేరే ఉంటదిలే.. అక్క కదా అంటూ మరోసారి నాగ్ సెటైర్ వేశారు. దాంతో ఆమె హర్ట్ అయ్యింది.
ఇది కూడా చదవండి : సూపరో సూపర్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్
హరితేజ- నయని- యష్మీలలో యష్మీని సేవ్ చేశారు నాగార్జున. ఆతర్వాత హౌస్ మేట్స్ కు ఓ గేమ్ ఇచ్చారు నాగార్జున. ఈ గేమ్ లో మొదట్లోనే నయని పావని అవుట్ అయ్యింది. ఆతర్వాత వరుసగా అందరూ అవుట్ అయ్యారు. చివరకు నిఖిల్ విన్ అయ్యాడు. దాంతో లక్ష ప్రైజ్ మనీ యాడ్ చేశారు నాగ్. ఆతర్వాత మరో టాస్క్ ఇచ్చారు నాగ్.
ఇది కూడా చదవండి : Tollywood : అమ్మబాబోయ్..! రచ్చ రచ్చ చేస్తుందిగా..!! ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోయిన్ గుర్తుందా..?
ఓ దారుణమైన జ్యూసు కంటెస్టెంట్స్ ముందు పెట్టి మీకు నచ్చిన వారికి అది ఇవ్వాలి అని చెప్పారు నాగ్. అలాగే సరైన రీజన్స్ చెప్పాలి అన్నారు. యష్మీ, గౌతమ్‌కి జ్యూస్ ఇచ్చింది. దాంతో ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఆతర్వాత నామినేషన్స్ లో ఉన్న నయని- హరితేజ ఇద్దరినీ యాక్టివిటీ ఏరియాలోకి పిలిచారు నాగ్. ఇక ఇద్దరి ముందు ఫొటో ఫ్రేమ్‌ను ఉంచి సుత్తితో పగలగొట్టమన్నారు. దాంతో నయానికి ఎలిమినేట్ అని వచ్చింది. దాంతో ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. వస్తూ వస్తు హౌస్ మేట్స్ పై షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది. హౌస్ లో డమ్మీ కంటెస్టెంట్స్ ఎవరు అని నాగ్ అడిగితే గంగవ్వ, రోహిణి,ప్రేరణ,గౌతమ్, విష్ణు ప్రియా పేర్లు చెప్పింది నయని. ఇక మొత్తానికి హౌస్ నుంచి క్రై బేబీ బయటకు వచ్చేసింది.
ఇది కూడా చదవండి : ఈ హీరోలను గుర్తుపట్టారా.? పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.