AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 : సోనియా లవ్ స్టోరీకి ఎండ్ కార్డు.. కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్..

యష్మీ టీమ్ లో ఎక్కువ మంది ఉండటంతో ఆమెకు ఎక్కువ టైం ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ముగ్గురు చీఫ్‌ రేషన్‌ను వాళ్లు ఉపయోగించుకోవాలంటే టాస్క్ లు గెలవాలి అని ఓ కిరికిరి పెట్టాడు. ముందుగా లెమన్ పిజ్జా టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో యష్మి టీమ్ గెలిచింది. ఆతర్వాత కనిపెట్టు పరిగెత్తు అనే టాస్క్ ఇచ్చాడు.. దానిలో నైనికా టీమ్ విన్ అయ్యింది.

Bigg Boss 8 : సోనియా లవ్ స్టోరీకి ఎండ్ కార్డు.. కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్..
Bigg Boss 8
Rajeev Rayala
|

Updated on: Sep 12, 2024 | 7:50 AM

Share

బిగ్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో చీఫ్‌లకి హౌస్‌లో ఏర్పాటు చేసిన సూపర్ బజార్ నుంచి రేషన్ తెచ్చుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఇక యష్మీ టీమ్ లో ఎక్కువ మంది ఉండటంతో ఆమెకు ఎక్కువ టైం ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ముగ్గురు చీఫ్‌ రేషన్‌ను వాళ్లు ఉపయోగించుకోవాలంటే టాస్క్ లు గెలవాలి అని ఓ కిరికిరి పెట్టాడు. ముందుగా లెమన్ పిజ్జా టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో యష్మి టీమ్ గెలిచింది. ఆతర్వాత కనిపెట్టు పరిగెత్తు అనే టాస్క్ ఇచ్చాడు.. దానిలో నైనికా టీమ్ విన్ అయ్యింది. ఇచ్చిన రెండు టాస్క్ ల్లో ఓడిపోయిన నిఖిల్ టీమ్ కు రాగి పిండి మాత్రమే ఇచ్చాడు బిగ్ బాస్. దానినేనే వారం సరిపెట్టుకోవాలి అని చెప్పాడు. మొదటి టాస్క్ లో తన టీమ్ గెలిచిన వెంటనే సోనియా ఏడవడం మొదలుపెట్టింది.

ఇది కూడా చదవండి : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..?

అసలు సోనియా ఎందుకు ఏడ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు. వెంటనే అభయ్ ఆమె దగ్గరికి వెళ్లి ఓదార్చాడు. ఆతర్వాత నిఖిల్ ఆమెదగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. సోనియాను తెగ ఓదార్చాడు నిఖిల్. కానీ ఏం లేదు.. ఏం లేదు అంటూ నిఖిల్ ను పక్కకి పంపి మరీ ఓదార్చాడు అభయ్. ఆతర్వాత పృథ్వీ కూడా సోనియాను ఓదార్చాడు. అసలు సోనియా ఎందుకు ఏడ్చిందో తెలుసా.? ఇన్నాళ్లు కలిసి తిన్నామ్.. ఇప్పుడు రేషన్స్ సపరేట్ అవ్వడం తో ఒకరు తింటుంటే మరొకరు చూస్తూ ఉండాలి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది అని ఏడ్చింది సోనియా.

ఇది కూడా చదవండి :దైర్యం ఉంటేనే చూడండి..! థియేటర్ నుంచి జనాలు పారిపోయిన సినిమా ఇది..

ఆతర్వాత రాత్రి సమయంలో సోనియా, నిఖిల్ డిస్కషన్ పెట్టారు. తప్పుడు నిర్ణయాలు ఏమైనా తీసుకున్నానా అని ఆలోచిస్తున్నా అని సోనియా అంది. దేని గురించి మాట్లాడుతున్నావ్ అని నిఖిల్ అంటే.. నువ్వు ఇలా బిహేవ్ చేయడం వాళ్ళ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయేమో అని అంది సోనియా దానికి నిఖిల్ నా వల్ల నీకు ఏమైనా గేమ్ ఎఫెక్ట్ అవుతుందని నువ్వు అనుకుంటే నీకు ఏది కరెక్ట్.. మంచిది అనిపిస్తే అది చెయ్.. అని నన్ను వదిలేయ్.. నాతో మాట్లాడకు అని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. దానికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది సోనియా. ఆతర్వాత యష్మి కి నిఖిల్ కుమధ్య డిస్కషన్ జరిగింది. ఆతర్వాత నైనికా దగ్గర తన గురించి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నిఖిల్.” నేను మనిషిలా ఉందమనుకుంటున్నా.. చాలా యంగ్ ఏజ్ నుంచే ఫ్యామిలీ బాధ్యతలు నేను తీసుకున్నా.. అది కూడా నాకు చాలా ఇష్టం.. కానీ ఆ జర్నీలో నన్ను నేను కోల్పోయా.. కొన్ని సార్లు కొన్ని విషయాలు చాలా అన్ ఫెయిర్ అనిపిస్తాయి కదా నాన్న..” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నిఖిల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.