Bigg Boss 8 Telugu: హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. శేఖర్ భాష లేజీగా ఉన్నాడు అంటూ..
మొన్నటి నామినేషన్స్‌ను కంటిన్యూ చేస్తూ నిన్నటి ఎపిసోడ్ లో మిగిలిన వారు నామినేషన్స్ మొదలు పెట్టారు. ముందుగా ఆదిత్య ఓం నామినేషన్ మొదలు పెట్టాడు. పృథ్వీని క్లీనింగ్ విషయంలో నామినేట్ చేశాడు. అలాగే శేఖర్ బాషా లేజీగా ఉన్నాడంటూ నామినేట్ చేశాడు. ఈ ఇద్దరిలో పృథ్వీని సేవ్ చేసి బాషాను సెలక్ట్ చేశారు చీఫ్‌లు.
బిగ్ బాస్ సీజన్ 8 మొదలైన దగ్గర నుంచి గొడవలు, గోలలుతో రచ్చ జరుగుతోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మరోసారి నామినేషన్స్ రచ్చ జరిగింది. మొన్నటి నామినేషన్స్‌ను కంటిన్యూ చేస్తూ నిన్నటి ఎపిసోడ్ లో మిగిలిన వారు నామినేషన్స్ మొదలు పెట్టారు. ముందుగా ఆదిత్య ఓం నామినేషన్ మొదలు పెట్టాడు. పృథ్వీని క్లీనింగ్ విషయంలో నామినేట్ చేశాడు. అలాగే శేఖర్ బాషా లేజీగా ఉన్నాడంటూ నామినేట్ చేశాడు. ఈ ఇద్దరిలో పృథ్వీని సేవ్ చేసి బాషాను సెలక్ట్ చేశారు చీఫ్‌లు. ఆ తర్వాత కిరాక్ సీత వచ్చి ప్రేరణ అన్న కొన్ని మాటలు నచ్చలేదంటూ తన మొదటి నామినేషన్ వేసింది. ఆ తర్వాత కుక్కర్ విషయంలో బేబక్కను నామినేట్ చేసింది. ఈ ఇద్దరిలో ప్రేరణను సేవ్ చేసి.. బేబక్కన బుక్ చేసింది చీఫ్ నైనిక.
నెక్స్ట్ అభయ్ వచ్చి నాగ మణికంఠను నామినేట్ చేశాడు. నీకు సారీ చెబుదామని వచ్చిన ఆదిత్యతో కోప్పడ్డావు. ఒక్కసారి కోపం తెచ్చుకోవడం ఓకే.. కానీ మళ్లీ మళ్లీ చేయడం తప్పు అని అభయ్ మణికంఠను నామినేట్ చేశాడు. నువ్వు హైపర్ అవుతున్నావ్.. ఎమోషనల్‌గా హై ఉన్నావ్.. అని అభయ్ అంటే.. నా బిహేవియర్ అలాంటిది అంటూ పొగరుగా మాట్లాడాడు. ఎవడి ఫ్లాష్ బాగ్‌లు ఇక్కడ అవసరం లేదు. గేమ్ ఆడటానికి వచ్చాము.. హౌస్ లో ఉండే తీరు గురించి మాట్లాడుకుందాం అని అభయ్ అన్నాడు. దాంతో మిగిలిన వారు క్లాప్స్ కొట్టారు. నేను అన్ ఫిట్ అయితే నేనే వెళ్ళిపోతా అని అన్నారు మణికంఠ. ఆతర్వాత తన రెండో నామినేషన్ బేబక్కకి వేశాడు అభయ్. వీరిలో మణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది యష్మీ..
ఆ తర్వాత వచ్చిన విష్ణుప్రియ.. శేఖర్ బాషా కాస్త లేజీగా ఉన్నారంటూ అతన్ని నామినేట్ చేసింది. అలానే కుక్కర్ విషయంలో బేబక్క తప్పు లేకుండా గొడవ పెట్టుకున్నావంటూ సోనియాను నామినేట్ చేసింది. దాంతో సోనియా విష్ణు ప్రియతో కాస్త గట్టిగానే గొడవేసుకుంది. ఈ ఇద్దరిలో శేఖర్‌ను నామినేట్ చేసింది యష్మీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి