Bigg Boss 8 Telugu Promo 1: దోస్తుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్బాస్.. నిఖిల్ పై విరుచుకుపడిన యష్మీ.. ప్రోమో చూశారా..?
ముగ్గురు చీఫ్స్ లో ఎవరెవరు గొప్ప అనే విషయాన్ని తేల్చుకోవాల్సిందిగా ఫిటింగ్ పెట్టాడు. యష్మీ, నైనిక టీమ్స్ మధ్య ఓ గేమ్ పెట్టగా.. ఎవరు గెలిస్తే వారు నిఖిల్ టీం నుంచి ఓ సభ్యుడిని తీసుకోవచ్చు అనే ఆఫర్ ఇచ్చాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఫస్ట్ టాస్కులో యష్మీ సులభంగా గెలిచింది. అయితే వీరు నిఖిల్ టీం నుంచి ఎవరిని సెలక్ట్ చేసుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది.
తొలివారంలోనే హౌస్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఓవైపు కన్నీళ్లతో బిగ్బాస్ హౌస్ నిండిపోతుంటే.. మరోవైపు నువ్వా నేనా అంటూ తెగ తిట్టుకుంటున్నారు కంటెస్టెంట్స్. ఫస్ట్ వీక్ నామినేషన్స్ తర్వాత హౌస్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముగ్గురు చీఫ్ లు.. వారికి ప్రత్యేక సైన్యం అంటూ హౌస్మేట్స్ అందరిని గుంపులుగా విడగొట్టిన బిగ్బాస్ ఇప్పుడు అసలైన ఆట మొదలుపెట్టాడు. ముగ్గురు చీఫ్స్ లో ఎవరెవరు గొప్ప అనే విషయాన్ని తేల్చుకోవాల్సిందిగా ఫిటింగ్ పెట్టాడు. యష్మీ, నైనిక టీమ్స్ మధ్య ఓ గేమ్ పెట్టగా.. ఎవరు గెలిస్తే వారు నిఖిల్ టీం నుంచి ఓ సభ్యుడిని తీసుకోవచ్చు అనే ఆఫర్ ఇచ్చాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఫస్ట్ టాస్కులో యష్మీ సులభంగా గెలిచింది. అయితే వీరు నిఖిల్ టీం నుంచి ఎవరిని సెలక్ట్ చేసుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది.
తాజాగా విడుదలైన ప్రోమోలో ఇద్దరు దోస్తుల మధ్య చిచ్చు పెట్టేశాడు బిగ్బాస్ . షో మొదటి రోజు నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు నిఖిల్, యష్మీ. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఇద్దరు ఒకే మాట మీద ఉంటున్నారు. ఇక యష్మీ చీఫ్ కావడానికి మెయిన్ రీజన్ నిఖిల్. నైనిక నబీల్ పేరు చెప్పగా.. నిఖిల్ మాత్రం యష్మీ చీఫ్ కావాలంటూ నైనికను ఒప్పించాడు. దీంతో నిఖిల్, నైనికతోపాటు యష్మీ కూడా చీఫ్ అయ్యింది. చివరకు ఇప్పుడు ఇద్దరు బడ్డీస్ మధ్య పెద్ద గొడవే జరిగినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో.. రెండు క్లాన్స్ మధ్య సెకండ్ టాస్క్ మొదలైంది.
రెండు టీం సభ్యులు చైన్ సిస్టంలాగా నిలబడి చేతులతో పట్టుకోకుండా శరీరాల మీదుగానే రింగ్స్ ఓవైపు నుంచి మరోవైపుకు చేరవేయాల్సి ఉంటుంది. అయితే యష్మీ టీం రింగ్స్ అన్నింటిని శరీరాం మొత్తాన్ని తిప్పి తీసుకెళ్తారు. కానీ నైనిక టీం మాత్రం కేవలం మెడ చేతుల నుంచి మాత్రమే రింగ్స్ తీసుకువస్తారు. ఈ టాస్కులో నైనిక టీం ముందుగా రింగ్స్ అన్నింటిని మరోవైపుకు చేరవేయడంతో నైనిక టీం గెలిచిందని ప్రకటిస్తాడు నిఖిల్. దీంతో యష్మీ టీం గొడవకు దిగుతుంది. బిగ్బాస్ శరీరం మొత్తం తిప్పి రింగ్స్ తీసుకురావాలని చెప్పారని చెప్పడంతో శరీరం మొత్తం అని చెప్పలేదు.. శరీరం నుంచి అని చెప్పారంటూ నైనిక టీం వాదిస్తుంది. ఇక నిఖిల్ కూడా నైనిక టీంకు సపోర్ట్ చేయడంతో యష్మీ రెచ్చిపోయింది. రూల్స్ బ్రేక్ చేస్తున్నారంటూ నిఖిల్ తో గొడవకు దిగింది. అటు నిఖిల్ కూడా యష్మీకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికి రెండో టాస్కుతో దోస్తులు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాడు బిగ్బాస్ .
బిగ్బాస్ ప్రోమో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.