AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallavi Prashanth: అజ్ఞాతంలోకి బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్…

ఆదివారం బిగ్ బాస్ 7 విన్నర్‌‌ను ప్రకటించిన తరువాత హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆ స్టూడియో ఉన్న ప్రాంతంలో వేల మంది అభిమానులు గుమిగూడారు. దీంతో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది. విజేత ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ అభిమానులుగా చెప్పుకుంటున్న కొందరు ఘర్షణకు దిగారు. అటుగా వెళ్లే వాహనాలు, ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు.

Pallavi Prashanth: అజ్ఞాతంలోకి బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్...
Nagarjuna -Pallavi Prashanth
Ram Naramaneni
|

Updated on: Dec 20, 2023 | 10:15 AM

Share

అత్యుత్సాహం కొంపముంచింది.. రైతుబిడ్డగా బిగ్‌బాస్‌లోకి వెళ్లి సెన్సేషన్ అయిన పల్లవి ప్రశాంత్‌.. బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచి బయటికి వచ్చిన వెంటనే కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి బయటకు వస్తునే ర్యాలీ తీసిన సమయంలో జరిగిన గొడవ ఇప్పుడు కేసులు వరకూ వెళ్లింది.  ప్రస్తుతం బిగ్‌బాస్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ అజ్ఞాతంలో ఉన్నారు. కేసులు నమోదుకాగానే కనిపించకుండాపోయారు ప్రశాంత్‌.  ప్రశాంత్‌ లాయర్‌ జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు వచ్చి కేసు వివరాలు సేకరించనున్నారు.  జూబ్లీహిల్స్‌ పోలీసులు స్పందించకపోతే డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రశాంత్ లాయర్ రాజ్‌కుమార్‌ సిద్దమయ్యారు. కేసుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెప్పుకుంటున్న కొందరు చేసిన న్యూసెన్స్ అంతా ఇంతా కాదు. అభిమానం పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు.. బయట గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన బిగ్‌బాస్‌ యాజమాన్యం పల్లవి ప్రశాంత్‌ను పోలీసుల సహకారంతో వేరే మార్గం నుంచి బయటికి పంపించింది. అయితే పల్లవి ప్రశాంత్‌ ఇటు పోలీసుల ఆదేశాలను, అటు బిగ్‌బాస్‌ యాజమాన్యం సూచనలను బేఖాతర్‌ చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్‌ టాప్‌ జీప్‌పై చేరుకోవడంతో రచ్చ స్టార్ట్ అయ్యింది. బస్సులపై రాళ్లు రువ్వడం, మిగతా కంటెస్టెంట్‌ల కార్లపై కొందరు దాడి చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. అమర్‌దీప్, అశ్విని, బిగ్ బాస్ బజ్ హెస్ట్ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. వారి కార్ల అద్దాలు పగిలాయి. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఐతే.. విన్నర్‌గా గెలిచినందునే తాను అందరినీ కలిసి వెళ్లాలి అనుకున్నానంటూ ప్రశాంత్‌ చెప్పుకొచ్చాడు.

పోలీసులు ఈ ఘటనపై సుమోటోగా ఈ కేసు పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ కారు నడిపిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రెండు కేసులు పెట్టగా ఒక దాంట్లో పల్లవి ప్రశాంత్ పేరు కూడా చేర్చారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నాన్ బెయిలబుల్ కావడంతో ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్