Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అతనేనా..? ఈసారి కూడా అమ్మాయిలకు హ్యాండ్ ఇచ్చారుగా
శివాజీ, అమర్, అర్జున్, ప్రశాంత్, ప్రియాంక, యావర్ ఫైనలిస్ట్ లుగా నిలిచారు. ఈ ఆరుగురిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ కానున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు రావడంతో ఎవరు విన్నర్ అవుతారా అన్న ఆసక్తి నెలకొంది. ఈ వారం హౌస్ లో ఉన్న ఆరుగురికి తమ ఎమోషనల్ జర్నీని చూపించారు బిగ్ బాస్.

బిగ్ బాస్ సీజన్ 7 మరికొద్దిరోజుల్లో ముగుస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 7 చివరి వారం ఎమోషనల్ గా ఉండేలా చేశారు బిగ్ బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు ఉన్నారు. శివాజీ, అమర్, అర్జున్, ప్రశాంత్, ప్రియాంక, యావర్ ఫైనలిస్ట్ లుగా నిలిచారు. ఈ ఆరుగురిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ కానున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు రావడంతో ఎవరు విన్నర్ అవుతారా అన్న ఆసక్తి నెలకొంది. ఈ వారం హౌస్ లో ఉన్న ఆరుగురికి తమ ఎమోషనల్ జర్నీని చూపించారు బిగ్ బాస్. ఆరుగురి మెమరబుల్ మూమెంట్స్ ను చూపించారు. ఒకొక్కరు తమ బెస్ట్ మెమొరీస్ ను చూసి చాలా పొంగిపోయారు. కొంతమంది ఎమోషనల్ అయ్యారు.
ఇప్పటికే అమర్, అర్జున్, శివాజీ జర్నీని చూపించారు. ఇందుకు సబంధించిన ప్రోమోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు హౌస్ లో ఉన్నవారిలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అర్జున్ కు ఉన్నాయని కొందరు అంటున్నారు. మరికొందరు శివాజీ పేరు చేస్తున్నారు. ఇంకొంతమంది సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతాడని అంటున్నారు.
అయితే ఎక్కువ మంది అర్జున్ బిగ్ బాస్ విన్నర్ అవుతారని అంటున్నారు నెటిజన్స్. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలో లేడీ విన్నర్ అవ్వలేదు. ఒక్క బిగ్ బాస్ ఓటీటీలో మాత్రం బిందు మాధవి విన్నర్ గా నిలిచింది. అయితే ఈసారి కూడా లేడీ విన్నర్ అవ్వడం కష్టం అని అంటున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ప్రియాంకా ఇప్పటివరకు పోరాడి ఫైనలిస్ట్ అయినప్పటికీ ఆమె విన్నర్ అవడం కష్టమే అంటున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ 7 లో ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి..
View this post on Instagram
ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఎవరో అవుతారు.?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.