Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ విన్నర్ పై స్పందించిన నాగార్జున.. కామెంట్స్ వైరల్..
బిగ్‌బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంది. ఈరోజుతో బిగ్‌బాస్ సీజన్ ముగియనుంది. సన్నీ, సిరి, శ్రీరామ్, మానస్, షణ్ముఖ్ టాప్ 5

బిగ్‌బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంది. ఈరోజుతో బిగ్‌బాస్ సీజన్ ముగియనుంది. సన్నీ, సిరి, శ్రీరామ్, మానస్, షణ్ముఖ్ టాప్ 5 కంటెస్టెంట్స్‌గా మిగిలారు. ఇందులో విన్నర్ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్ విజేతను ప్రకటించనున్నారు. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ పూర్తైంది. దీంతో విన్నర్ ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత సీజన్లకు భిన్నంగా సీజన్ 5 ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన అతిథుల గురించి నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ విన్నర్ ఎవరనే విషయంపై హోస్ట్ నాగార్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాగార్జున కీలక పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్ర పోస్టర్ లాంచ్ వేడుక నిన్న హైదారాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రణబీర్ కపూర్, అలియా భట్ పాల్గొనగా.. హీరో నాగార్జున, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సైతం పాల్గొన్నారు. బ్రహ్మస్త్ర తెలుగు పోస్టర్‌ను నాగార్జున, రాజమౌళి ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో నాగార్జునకు వరుస బిగ్‌బాస్ షోకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.
నేను ఫినాలేకు వెళ్లాలి అంటూ తన స్పీచ్ ముగించారు నాగార్జున. దీంతో బిగ్‌బాస్ విజేతగా ఎవరిని చేస్తున్నారు అని విలేకరులు ప్రశ్నించగా.. నాగార్జున తెలివిగా ఆన్సర్ ఇచ్చారు. మీరంతా ఎవర్ని గెలిపిస్తే.. వాళ్లే బిగ్‌బాస్ విన్నర్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు నాగార్జున. ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం.. షణ్ముఖ్ మూడో స్థానంలో నిలవగా.. సింగర్ శ్రీరామచంద్ర రన్నరప్ అయ్యాడని.. సన్నీ బిగ్‌బాస్ విన్నర్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరీ ఈ వార్తల్లో నిజం ఉందో లేదా అనేది తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.
Bigg Boss 5 Telugu Ep.105: సందడిగా 5వ సీజన్ ఫైనల్ డే.. హౌస్‌లో రచ్చ చేసిన మాజీ కంటెస్టెంట్స్..
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ 5 తెలుగు గ్రాండ్ ఫినాలే.. ఎప్పుడు.. ఎక్కడ.. ముఖ్య అతిథులుగా ఎవరు..?




