‘Bootcut Balaraju’: ‘బూట్ కట్ బాలరాజు’గా బిగ్ బాస్ ఫేమ్ సోహెల్.. ఆకట్టుకుంటోన్న గ్లిమ్ప్స్
సోహెల్.. బిగ్ బాస్ లో పటిస్పీట్ చేసేంత వరకు ఈ పేరు పెద్దగా ఎవ్వరికి తెలీదు.. బిగ్ బాస్ తర్వాత సోహెల్ ఒక్కసారిగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.

సోహెల్.. బిగ్ బాస్ లో పటిస్పీట్ చేసేంత వరకు ఈ పేరు పెద్దగా ఎవ్వరికి తెలీదు.. బిగ్ బాస్ తర్వాత సోహెల్ ఒక్కసారిగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత సోహెల్ కు సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు. సోహెల్, అనన్య నాగళ్ళ (వకీల్‌సాబ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బూట్ కట్ బాలరాజు. లక్కీ మీడియాతో కలిసి గ్లోబల్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కొన్నేటి దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా చిత్రయూనిట్ యూనిట్ బూట్ కట్ బాలరాజు గ్లింప్స్ విడుదల చేసింది. `రింగు రింగు రూపాయ్ బిళ్ళ రూపాయి దండ.. అంటూ సాగే పాటతోపాటు సోహెల్ యాక్షన్ సీన్స్ ఆకర్షణీయంగా వున్నాయి. దానికితోడు ఊరికి ఒక మంచి పని చేసినావ్‌ర్రా అంటూ ఒకరు అడిగితే.. సోహెల్ చెప్పే సమాధానం ఫుల్ ఎంట్‌టైన్ చేస్తుంది. ఈరోజు విడుదలైన గింప్స్ మంచి ఆదరణ చూరగొంటుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, రచయిత ఫణి, రాకేష్, అశోక్ కుమార్ టీమ్‌గా ఫామ్ అయి మంచి కథను అందించారు. 9నెలలుగా కథను రెడీ చేసి షూటింగ్‌కు వెళ్ళాం. ఏకధాటిగా సాగిన షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. తాజాగా బూట్ కట్ బాలరాజు గ్లింప్స్ విడుదల చేశాం. కుటుంబంతో కలిసి హాయిగా చూడతగ్గ సినిమా అవుతుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు. సోహెల్ మాట్లాడుతూ.. కథ బాగుంటే అన్నీ కలిసి వస్తాయి. బిగ్‌బాస్‌లో వచ్చిన పేరు వేరు. సినిమా ద్వారా వచ్చే పేరు వేరు. అందుకే నన్ను నమ్మి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్ మెంట్ ఇచ్చేలా కృషి చేస్తున్నానని అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :